Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

అసాధారణ సెలవు (EOL) సంపాదిత సెలవు (EL) మధ్య వ్యత్యాసం

అసాధారణ సెలవు (EOL) సంపాదిత సెలవు (EL) మధ్య వ్యత్యాసం:
మౌలిక నిబంధనలోని 85(A) ప్రకారం ఏ  ఇతర అనుమతించదగిన సెలవు ప్రభుత్యోద్యోగి ఖాతాలో జమగా లేని సందర్భాలలో వ్రాతపూర్వకంగా దరఖాస్తు ద్వారా ప్రత్యేక పరిస్థితులలో మంజూరు చేయు సెలవును అసాధారణ సెలవు అందురు.
ఈ సెలవుకు జీతభత్యాలు అనుమతించరు
➤అసాధారణ సెలవు వ్యక్తిగత అవసరాల దృష్ట్యా వాడుకుంటే 3 సంవత్సరాల వరకు పెన్షన్ కు అనుమతిస్తారు. ఆ పైన సెలవును నాన్-క్వాలిఫయింగ్ సెలవుగా పరిగణిస్తారు.
➤ఈ సెలవు కాలంలో సమాన రోజులు వార్షిక ఇంక్రిమెంటు ముందుకు జరుగును. అదే అసాధారణ సెలవు వైద్య ధృవపత్రం పై వాడుకుంటే పెన్షన్ కు కలుస్తుంది. 6 నెలలకు మించిన సెలవును ఇంక్రిమెంటు మంజూరుకు అనుమతిస్తారు అయితే C&DSE గారి అనుమతి పొందాలి. 6 నెలలకు మించిన కాలమునకు ప్రభుత్వ అనుమతి పొందాలి.
➤సస్పెన్షన్ పీరియడు కు అసాధారణ సెలవు మంజూరు అయిన సందర్భంలో మాత్రం ఆ EOL పీరియడ్ను ఇంక్రిమెంట్లకు, పెన్షన్ లెక్కించాల్సిందే. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం Sub-Rule (5) of FR-54 మరియు Sb-Rule (7) of FR-54 ను సవరిస్తూ... GO Ms No 307 Fin (FR.II) Dept. dated 03.12.2012 జారీ చేసింది.
➤5 సంవత్సరాల సర్వీసు గల ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వ అనుమతితో విదేశాలలో ఉద్యోగం చేయుటకు 5 సంవత్సరాల వేతనం లేని సెలవు వాడుకొనవచ్చును. ఈ కాలము 2,3 లేదాఅంతకన్నా ఎక్కువ దఫాలుగా వాడుకొనవచ్చును.
G.O.Ms.No.214 F&P తేది: 3.9.1996
సంపాదిత సెలవు (EL):
➧సంపాదిత సెలవు గురించి APLR Rules-1933 లోని రూల్- 8,9,10,11,12,17 మరియు 20  లలో వివరించడం జరిగింది.
➧సంపాదిత సెలవు డ్యూటీలోనూ మరియు లీవ్ కాలంలోనూ జమచేయవచ్చు.
➧పర్మనెంట్ ఉద్యోగులకు సంవత్సరానికి 30 రోజులు, *G.O.Ms.No.317 తేది: 15.9.1994* ప్రకారం  ఉపాధ్యాయులకు సంవత్సరానికి 6 చొప్పున మంజూరుచేస్తారు.
➧ప్రతి అర్ధ సంవత్సరమునకు జనవరి 1న,జులై 1న 3 రోజుల చొప్పున EL ఖాతాకు జమచేయబడును.
➧CLs,HPLs ఖాతాలో నిల్వలేని సందర్భాలలో ఉద్యోగ/ఉపాధ్యాయుల కు  ఒక్కరోజు కూడా EL మంజూరుచేసే అధికారం సంబంధిత DDO లకు కలదు.
➧ఈ సెలవు గరిష్ట నిలువ పరిమితి 300 రోజులు మాత్రమే*G.O.Ms.No.232 తేది: 16.9.2005
ఇట్టి సంపాదిత సెలవును ఒకేసారి 180 రోజుల వరకు వాడుకొనవచ్చును.**G.O.Ms.No.153 తేది: 4.5.2010

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND