స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉందా ? కొత్త ATM రూల్స్ వచ్చాయి, అవి ఇక్కడ !
SBI ATM new rules India
➤స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బ్యాంకు ఎకౌంట్ కలిగి ఉన్న వినియోగదారులకి కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాస్తవానికి జులై 1 2020 నుండి ఇవి వినియోగంలో ఉన్నప్పటికీ దీని గురించి ఎక్కడా ప్రత్యేకంగా ప్రస్తావన లేదు.
➤అయితే తాజాగా వీటిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ కొత్త నియమాల ప్రకారం మెట్రో నగరాల్లో నివసించే వినియోగదారులకు నెల మొత్తం మీద మొత్తం ఎనిమిది ఉచిత ATM లావాదేవీలు అందించబడతాయి. వాటిలో 5 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్ నుండి నిర్వహించుకోవచ్చు. మిగిలిన మూడు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో చేసుకోవచ్చు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో నెలకు 10 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. వీటిలో ఐదు ఎస్ బి ఐ ఎటిఎంల నుండి, మిగిలిన ఐదు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి పూర్తి చేసుకోవచ్చు.
➤అలాగే తమ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయల కంటే ఎక్కువ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్న వినియోగదారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో లేదా ఇతర బ్యాంక్ ఎటిఎంలలో అపరిమితమైన లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. SBI ATM ద్వారా నగదు విత్ డ్రా చేసుకునేటప్పుడు ఆ ఖాతాదారుడి యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటిపి పంపించబడుతుంది. దానిని ఏటీఎం మిషన్ స్క్రీన్ మీద ఎంటర్ చేస్తే మాత్రమే నగదు విత్ డ్రా అవుతుంది. పది వేల రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగి ఉన్న లావాదేవీలను రాత్రి ఎనిమిది గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల మధ్య చేసేవారికి ఇలా ఓటీపీ తప్పనిసరి.
➤ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవటంవల్ల ATM విత్‌డ్రాయల్ నిలిచిపోతే, అలాంటి లావాదేవీలకు ఒక్కోదానికి 20 రూపాయలు మరియు జీఎస్టీ ఫీజ్‌గా అమలు చేస్తారు.

No comments:
Post a Comment