నాలుగేళ్ల డిగ్రీలో నైపుణ్యాభివృద్ధి
➧ఆనర్స్ చదివిన వారికి పీజీ ఏడాదే
➧ఉన్నత విద్యా మండలి కసరత్తు
రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టనున్న నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీలో పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శిక్షణ ఉండేలా ఉన్నత విద్యా మండలి పాఠ్య ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ డిగ్రీ పూర్తి చేసిన వారికి పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సు ఏడాది మాత్రమే ఉంటుంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా దీన్ని తీసుకొస్తున్నారు. సాధారణ డిగ్రీ, ఆనర్స్ వారికి మొదటి ఏడాది కోర్సులు ఒకేలా ఉంటాయి. ఆ తరవాత నుంచి మార్పులుంటాయి. అక్టోబరు 15 నుంచి నిర్వహించే ప్రవేశాల నాటికి పూర్తిస్థాయి పాఠ్య ప్రణాళికను అందుబాటులోకి తెచ్చేందుకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి నేతృత్వంలో కసరత్తు సాగుతోంది.
ఇవీ ప్రతిపాదనలు..
➤ఆనర్స్ డిగ్రీలో కమ్యూనిటీ ప్రాజెక్టు వర్క్‌తో కలిపి 10 నెలలు అప్రెంటిషిప్ ఉంటుంది. మూడేళ్ల డిగ్రీలో చివరి సెమిస్టర్‌లో ఉండే ఆరు నెలల అప్రెంటిషిప్‌ను నాలుగో ఏడాదిలో ప్రవేశపెట్టనున్నారు. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శిక్షణ ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు అందించేలా ఈ కోర్సు రూపకల్పన చేస్తున్నారు.
➤జాతీయ విద్యా విధానం ప్రకారం ‘పరిశోధన డిగ్రీ’, ‘పరిశోధనతో సంబంధం లేని డిగ్రీ’ వేర్వేరుగా ఉన్నందున ఈ రెండింటినీ ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. పరిశోధన చేసిన వారు నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశం పొందవచ్చు.
➤నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం నాలుగేళ్ల డిగ్రీలో విద్యార్థి మొదటి ఏడాదిలోనే చదువు ఆపేస్తే వారికి సర్టిఫికెట్, రెండో ఏడాదిలో మానేస్తే డిప్లొమా, మూడో ఏడాదిలో వెళ్లిపోతే డిగ్రీ ఇవ్వాలనే నిబంధన ఉంది. దీన్ని ఎలా అమలు చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నారు. ప్రవేశాల సమయంలోనే విద్యార్థులకు మూడేళ్లు, నాలుగేళ్ల డిగ్రీలను ఎంపిక చేసుకునే ఐచ్ఛికం ఇవ్వనున్నారు.

No comments:
Post a Comment