ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే దూర విద్య ఇంటర్, పదో తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి ప్రారంభించారు. గుంటూరులోని రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇందుకోసం 1,077 స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఆయా కేంద్రాలను సంప్రదించి దూర విద్య విధానంలో ఇంటర్, పది పూర్తి చేయడానికి ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అక్టోబరు 10 వరకు గడువు ఉందని తెలిపారు. అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి అక్టోబరు 15, ఆలస్య రుసుముతో అక్టోబరు 31, రూ.200 నిర్ణీత ఫీజు, ఆలస్య రుసుముతో నవంబరు 5లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Website -http://www.apopenschool.org

No comments:
Post a Comment