హైస్కూళ్లల్లో టీచర్ఎక్సేంజ్ ప్రోగ్రామ్
నాణ్యతతో కూడిన విద్య అందరికీ అందేలా చేయాలన్న లక్ష్యంలో భాగంగా ట్వినింగ్ స్కూల్ పేరిట టీచర్ ఎక్సేంజ్ ప్రో గ్రామ్ను 2020-21 విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. జిల్లాలో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకూ నిర్వహిస్తోన్న 50 హై స్కూళ్లను ఎంపిక చేసి ఈ నెల 20వ తేదీలోగా జాబితాను ప్రభుత్వానికి పంపించనున్నారు. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని 25 హైస్కూళ్లను మాస్టర్ స్కూళ్లు గా ఎంపిక చేస్తారు. మరో 25 స్కూళ్లను గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంపిక చేస్తారు. ఇదే క్రమంలో మాస్టర్ స్కూల్ లో ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యాశాఖ నిర్ణయించిన నెలలో గ్రామీణ ప్రాంత పాఠశాలల కు వెళ్లి అక్కడి పాఠశాలలోని తరగతి గది బోధన, ప్రాజెక్టు వర్కులు, సైన్స్ ఫేర్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వంటివి నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో బెస్ట్ప్రాక్టీసెస్ పై పరిశీలన చేసి సూచనలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి జిల్లా విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది.

No comments:
Post a Comment