AP: యూత్‌కి గుడ్‌న్యూస్.. 6500 పోలీస్ ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రారంభం..!
ఏపీలో పోలీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన కార్యాచరణ మొదలైనట్లు తెలుస్తోంది.
ఏపీ ప్రభుత్వం
పోలీస్ శాఖలో 6500 పోస్టులకు డిసెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేస్తామని.. నాలుగు దశల్లో పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేసిన విషయమూ విధితమే. అయితే.. తాజాగా ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన కార్యాచరణ మొదలైంది. రాష్ట్రంలో జిల్లాలు, నగర పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియజేయాలంటూ ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్‌లకు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ పోస్టులకు సంబంధించి డిసెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసి.. జనవరిలో రిక్రూట్‌మెంట్ షెడ్యూల్ విడుదల చేస్తారు. కాబట్టి నిరుద్యోగ యువత ఇప్పటి నుంచే అన్ని విధాల సన్నద్ధమయ్యే ప్రయత్నాలు మొదలుపెడితే పోలీస్ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు.
No comments:
Post a Comment