పీఆర్సీ నివేదిక సమర్పణ
- ఆరుసార్లు గడువు తర్వాత వేతన సవరణ నివేదిక సమర్పణ
- పీఆర్సీ కమిషనర్ ఆశుతోష్ మిశ్రా రాకుండానే . . . !
- పీఆర్సీ నివేదిక సమర్పణ
➧ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు శుభవార్త. వేతన సవరణ నివేదికను 11 వ వేతన కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది.
➧సోమవారం సాయంత్రం నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ని కలిసి నివేదికను వేతన కమిషన్ అందించింది. ఎన్నాళ్లగానో ఉద్యోగులు ఇందుకోసం ఎదురు చూస్తున్నారు . ఆ కల ఫలించింది.
ఆరుసార్లు గడువు తర్వాత వేతన సవరణ నివేదిక సమర్పణ
➧వేతన సవరణ కమిషన్ 2018 మే 28న ఏర్పాటు. ఆరు సార్లు గడువు పొడిగించిన వేతన సవరణ కమిషన్ ఎట్టకేలకు సోమవారం తన పని పూర్తి చేసింది అక్టోబర్ 5న వేతన సవరణ నివేదికను సమర్పించింది.
➧2018లో వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
➧విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆశుతోష్ మిశ్రాను కమిషనర్ గా ప్రభుత్వం 2108 జులై 3న నియమించింది.
➧ఈ సంఘానికి ఏడాది గడువు ఇస్తూ ఆ లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కోరింది.
➧ఇప్పటికి వేతన సవరణ నివేదిక కొలిక్కి వచ్చింది. చివరికి ప్రభుత్వానికి నివేదిక చేరింది ఇక అమలు ఎప్పటి నుంచి ఫిట్ మెంట్ ఎంత ఇతర సౌలభ్యాలు ఏమున్నాయనేది తేలాల్సి ఉంది.
➧2018 మే 28న 11వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
➧అదే ఏడాది జులై 3న అశుతోష్ మిశ్రాను వేతన కమిషన్ గా నియమించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏడాది లోప నివేదిక సమర్పించాలని సూచించారు.
➧ 2013 సెప్టెంబరు 30 వరకు మొదటిసారి కాలపరిమితి పొడిగించారు మరోసారి 2018 నవంబర్ 30 వరకు గడువు పెంచారు
2020 జనవరి 31 వరకు వేతన సవరణ కమిషన్ గడువు పెంచారు.
➧మార్చి 31 వరకు మరోసారి గడువు పెంచారు.
➧తిరిగి జూన్ 30 వరకు కాలపరిమితి పొడిగించారు.
➧మళ్లీ సెప్టెంబరు 30 వరకు గడువు మరోసారి పొడిగించారు చివరికి అక్టోబరు 5న సమర్పించారు.
పీఆర్సీ కమిషనర్ ఆశుతోష్ మిశ్రా రాకుండానే . . . !
➧పీఆర్సీ కమిషనర్ ఆశుతోష్ మిశ్రా రాకుండానే పీఆర్సీ నివేదికను సీనియర్ అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించారు. సహజంగా పీఆర్సీ కమిషనర్ ఆధ్వర్యంలో పీఆర్సీ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. కానీ సోమవారం నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో పీఆర్సీ కమిషనర్ హాజరుకాకుండానే నివేదిక సమర్పించడం గమనార్హం.
No comments:
Post a Comment