విద్యార్థులకు 'మనో దర్పణ్
మానసిక స్థైర్యం పెంచేలా భరోసా
ఉపాధ్యాయులు, హెచ్ఎంలకు సమగ్రశిక్ష ఎస్పీడీ సూచనలు
కోవిడ్ 19 ప్రభావం ఉపాధ్యా యులు, విద్యార్థులు, తల్లిదండ్రులపై పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులు మానసిక, శారీరక ఇబ్బందులను తొలగించి మనోస్టై ర్యాన్ని నింపేందుకు 'మనో దర్పణ్ ద్వారా వయో దశలను అనుసరించి సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కె.వెట్రిసెల్వి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యా యులకు కొన్ని సూచనలు చేశారు.
కోవిడ్ పై విద్యార్థుల భయాందోళనలను తొల గించాలి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం దగ్గు , తుమ్ములు వచ్చినప్పుడు రుమాలు అడ్డం పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడాన్ని అనుసరించేలా చేయాలి.
కోవిడ్ అధిగమించిన వయోవృద్ధుల గురించి చెప్పి మనోస్థైర్యాన్ని కల్పించాలి.
పిల్లల సందేహాలను నివృత్తి చేసి భరోసా కలిగించాలి. మానసిక ఆరోగ్య నిపుణులుతో మాట్లాడించి ఒత్తిడిని అధిగమించేలా చేయాలి.
పిల్లల సామాజిక, దృశ్య మాధ్యమాల ద్వారా స్నేహితులతో మాట్లాడడం, చిత్రకళ, పజిల్స్ బొమ్మలు తయారు చేయటం లాంటి కార్యక్ర మాలు ఇంటి నుంచే చేసేలా ప్రోత్సహించాలి.
చిత్రకళ, సంగీతం, నృత్యం లాంటి కళలు నేర్చుకునే అవకాశం కలిగించాలి.
CSE , AP వారి తాజా ఉత్తర్వులలోని ముఖ్యాంశాలు
(Rc No.151/A&I/2020, Dt.02.10.2020)
మనోదర్పణ్ " కార్యక్రమం క్రింద ది.04.10.2020 నుండి ది.p10.10.2020 వరకు విద్యార్థుల మానసిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా ప్రతిరోజూ క్రింది కార్యక్రమాలు నిర్వహించాలి
విద్యార్థులకు సంబంధించిన పలు దైనందిన సంఘటనలను/పరిస్థితులను ఆధారంగా చేసుకొని కథల రూపంలో మానసిక ఆరోగ్యం పెంపొందించే అంశాలను హైలైట్ చేసి విద్యార్థులలో మానసిక స్థైర్యం పట్ల చైతన్యం కలిగించాలి
మనం విద్యార్థులకు చెప్పే కథలు, అడిగే ప్రశ్నలు రెండూ మిళితం చేసి వాటిని ప్రచారం/వ్యాప్తి చేయాలి
మానసిక ఆరోగ్యం పెంపొందించే అంశాలపై పోస్టర్ లు & స్లోగన్ లు తయారుచేసేలా విద్యార్థులను ప్రోత్సహించాలి*
పైవన్నీ ఉపాధ్యాయులు whatsapp/phone calls/online/offline ల ద్వారా విద్యార్థులకు మార్గదర్శనం చేయాలి
ప్రతి వారాంతపు రిపోర్ట్ ఉపాధ్యాయులు యధావిధిగానే అప్ లోడ్ చేయాలి
No comments:
Post a Comment