RGUKT-CET 2020: నవంబర్ 28న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష.. పరీక్ష విధానం, ముఖ్య తేదీలు ఇవే..
ట్రిపుల్ ఐటీ, డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు ఈ ఏడాది ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ట్రిపుల్ ఐటీలు, ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ (గుంటూరు), వెంకటేశ్వర పశుసంవర్ధక వర్సిటీ (తిరుపతి), వైఎస్‌ఆర్ ఉద్యాన వర్సిటీ (వెంకట్రామన్నగూడెం)లో రెండేళ్లు, మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకై ఈ ఏడాది ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. నవంబరు 28న ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
ఆర్జీయూకేటీ సెట్ 2020
పరీక్ష 100 మార్కులకు:
ఈ ప్రవేశ పరీక్షలో వంద మార్కులకు ఉండనుంది. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో.. ఓఎంఆర్ ఆధారిత జవాబు పత్రం ఉంటాయని వెల్లడించారు.
పదో తరగతిలోని గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల నుంచి ప్రశ్నలు ఇవ్వనున్నట్లు తెలిపారు. నమూనా ప్రశ్నపత్రాన్ని రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అభ్యర్థులు http://www.rgukt.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష విధానం:
పదోతరగతి గణితం నుంచి 50, భౌతిక, రసాయన శాస్త్రాల నుంచి 25, జీవశాస్త్రం నుంచి 25 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష నవంబర్ 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.
సీట్లు సంఖ్య:
ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు(ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం): 4000 సీట్లు
రెండేళ్లు, మూడేళ్ల డిప్లొమా కోర్సులు: 6000 సీట్లు
కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్లు ప్రకటించిన ప్రభుత్వం ఎలాంటి మార్కులు, గ్రేడ్లు, గ్రేడ్‌పాయింట్లు కేటాయించలేదు. దీంతో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. వంద కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉండే మండలంలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. స్థానికేతరులకు 15 శాతం సీట్లు ఉంటాయి. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ముఖ్య సమాచారం:
దరఖాస్తుల స్వీకరణ: అక్టోబర్ 28, 2020
దరఖాస్తుకు చివరితేది: నవంబర్ 10, 2020 (రూ.వెయ్యి అపరాధ రుసుంతో నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు)
దరఖాస్తు ఫీజు: ఓసీలకు రూ.300, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: నవంబరు 22 నుంచి
వెబ్‌సైట్:http://www.rgukt.in/
No comments:
Post a Comment