ఉపాధ్యాయ బదిలీలకు పాస్‌వర్డ్ ప్రతిబంధకం
➤పలువురికి ఇబ్బంది
➤పాయింట్ల పేచీ..
ఉపాధ్యాయుల పునర్విభజన ప్రక్రియ పూర్తి కావడంతో బదిలీలకు అడుగులు పడుతున్నాయి. ఐదేళ్లు పూర్తయిన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు పూర్తయిన పాఠశాల సహాయకులు, ఎస్జీటీలతో తప్పనిసరి బదిలీ జాబితా సిద్ధం చేశారు. ఒకే ప్రాంతంలో రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారికీ అవకాశం కల్పించారు. గురువారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.
➧ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ట్రాన్స్‌ఫర్స్-2020 వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతి టీచరు చరవాణికి ట్రెజరీ ఐడీతో పాటు బదిలీ దరఖాస్తుకు సంబంధించి వివరాలు నమోదు చేయాలంటే ఒక్కసారి మాత్రమే పాస్‌వర్డ్ పంపుతారు. కొందరికి రాగా ఇంకొందరికి రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు.
➧చరవాణి పోయినా, నంబర్ పనిచేయకపోయినా ఒకేసారి పాస్‌వర్డ్‌తో ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉంది. సైట్‌లో నమోదు చేసే సమయంలో ప్రతిసారి ఓటీపీ వస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది.*
పాయింట్ల పేచీ..
➧ఉపాధ్యాయులకు పాయింట్లు మేరకు ప్రదేశాలు కేటాయిస్తారు. నాలుగో కేటగిరీలో పనిచేసే వారికి సంవత్సరానికి ఐదు, మూడో కేటగిరీకి మూడు, రెండో కేటగిరీకి రెండు, మొదటి కేటగిరీ వారికి ఒక పాయింటు ఇస్తారు. గరిష్ఠంగా 40 పాయింట్లు ఉంటాయి. కొందరు ఉపాధ్యాయులు 2017లో నిర్వహించిన బదిలీల సందర్భంగా బదిలీ కాలేదు. ప్రధానోపాధ్యాయుడు ఒకే ప్రాంతంలో మూడో కేటగిరీలో ఎనిమిదేళ్లు పనిచేస్తే 24 పాయింట్లు వస్తాయి. ఐదేళ్లకు మాత్రమే పరిగణనలోకి తీసుకోవడంతో కేవలం 15 పాయింట్లు మాత్రమే దరఖాస్తులో చూపుతోంది.
➧పాఠశాల సహాయకులు, ఎస్జీటీలు ఒకే ప్రాంతంలో పదేళ్లు పనిచేసినా ఎనిమిదేళ్లు మాత్రమే పరిగణనలోకి తీసుకొని పాయింట్లు ఇస్తుండటంతో అవాక్కవుతున్నారు.
➧పనిచేసిన సంవత్సరాలకు పాయింట్లు ఇస్తే బాగుంటుందని పలువురు చెబుతున్నారు.
➧పాస్వర్జ్ రాని వారికి గూగుల్ ఫాం పంపించబడుతుంది. గూగుల్ ఫాం పూర్తి చేయవలసి ఉంటుంది
No comments:
Post a Comment