పలు రాష్ట్రాల్లో తెరిచిన కొద్దిరోజుల్లోనే పాఠశాలలు మూసివేత
కరోనా కారణంగా మూతబడిన పాఠశాలలను ఇటీవలే పలు రాష్ట్రాల్లో తిరిగి ప్రారంభించారు. స్కూళ్లు తెరిచిన వారం రోజుల వ్యవధిలోనే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్‌లలోని స్కూళ్లలో కరోనా కలకలం మొదలైంది. పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది కరోనా బారినపడ్డారు. దీంతో స్కూళ్లను మళ్లీ మూసివేసే దిశగా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవలే తెరిచిన స్కూళ్లను తిరిగి మూసివేశారు. ఒడిశా ప్రభుత్వం పాఠశాలలను తెరవాలని ముందర నిర్ణయించినా కరోనా సెకెండ్ వేవ్‌పై అనుమానంతో వెనక్కితగ్గింది. ఉత్తరాఖండ్‌లోని ప్రభుత్వ పాఠశాల్లో పనిచేసే 80 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో వెంటనే స్కూళ్లను మూసివేశారు. మిజోరంలో పాఠశాలలు తెరిచిన కొద్ది రోజుల్లోనే పలువురు విద్యార్థులు కరోనా బారిన పడటంతో అక్టోబరు 25నుంచి తిరిగి స్కూళ్లను మూసివేశారు. అసోంలో కరోనా భయంతో పాఠశాలలను తిరిగి మూసివేయాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా పాఠశాలలను తెరవలేదు.
No comments:
Post a Comment