Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తుల పరిశీలన

 దరఖాస్తుల పరిశీలన

➤ ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తు చేసుకోవటానికి సోమవారంతో గడువు ముగిసింది.

➤ దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియటంతో పరిశీలన ముమ్మరంగా సాగుతోంది. 

➤ ఈనెల 12 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 

➤సోమవారం లోపు ఉపాధ్యాయుల స్థాయిలో ఏమైనా మార్పు, చేర్పులు ఉంటే చేసుకునే అవకాశం కల్పించారు.

➤ మంగళవారం నుంచి ఏదైనా మార్పు, చేర్పులు చేయాలంటే ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మాత్రమే అవకాశం ఉంది. 

➤వీరు దరఖాస్తులు పరిశీలించి, బాగుంటే యాక్సెప్టు కొడితే ఎంఈవో లాగిన్‌కు చేరుతుంది.

➤అక్కడ మరోసారి పరిశీలించి సబ్మిట్‌ కొడితే నేరుగా డీఈవో లాగిన్‌కు వెళుతుంది.

➤రీ సబ్మిట్‌ కొడితే అందులో వివరాలు తప్పులు ఉన్నాయని అర్థం. అది తిరిగి ఉపాధ్యాయుడి చరవాణికి సమాచారం అందుతుంది. 

➤ వెంటనే వారు అప్రమత్తమై హెచ్‌ఎం, ఎంఈవోలను సంప్రదిస్తే వారు ఎంఈవో లాగిన్‌లోకి వెళ్లి తిరిగి వివరాలు సరిచేసుకునే అవకాశం ఉంటుంది. 

➤దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించటంతో ఎంఈవో కార్యాలయాల్లో ఈప్రక్రియ చురుగ్గా సాగుతోంది. 

➤మెడికల్‌బోర్డు సర్టిఫికెట్ల పరిశీలన విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కిందిస్ధాయి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

➤ బదిలీల క్రతువు ముగిసే వరకు జిల్లా స్థాయిలో ఏమైనా అభ్యంతరాలు వస్తే వాటిని వెంటనే పరిష్కరించటానికి జిల్లాకు ఒకరు చొప్పున సీనియర్‌ అధికారులను పరిశీలకులుగా పంపారు. 

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND