Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

పాఠశాలలు పున:ప్రారంభం-మార్గదర్శకాలు

పాఠశాలలు పున:ప్రారంభం-మార్గదర్శకాలు

➤ ప్రాథమికోన్నత పాఠశాలల  ఉపాధ్యాయులు మరియు-పేరెంట్ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు చర్చించుకుని సదరు  పాఠశాల స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్(పాఠశాల పున: ప్రారంభించేందుకు ముఖ్య మార్గదర్శకాలు) SOP, తయారు చేసుకోవాలి.

➤ పాఠశాలలో ప్రారంభానికి ముందు పాటించవలసిన ఆరోగ్య పర్యవేక్షణ పరిశుభ్రత మరియు ప్రామాణిక కార్యాచరణ విధివిధానాలు చర్చించాలి.

➤ covid-19 సంబంధించిన జాగ్రత్తలు శారీరక /సామాజిక దూరం covid 19గురించి మొదలైన వాటిపై పోస్టర్లు సిద్ధం చేయాలి.

➤తల్లిదండ్రులు వ్రాతపూర్వక అనుమతి తో పిల్లలను పాఠశాలకు అనుమతించాలి.

➤ పాఠశాలలో సరైన శుభ్రత మరియు పారిశుద్ధ్యం సౌకర్యాలు ఉండేలా చూడడం,ఫర్నిచర్ వంటశాలలు, తరగతి గదులు శుభ్రంగా ఉంచడం మరియు చేతులు కడుక్కోవటానికి సౌకర్యాలు ఉండేలా  చూడడం.

➤ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలసి టాస్క్ ఫోర్స్ టీములు ఏర్పాటు చేయడం, సమస్యలను గుర్తించడం.

➤ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని covid 19 నిబంధనలు పాటిస్తూ సీటింగ్ ప్రణాళిక చేయడం.

➤ తరగతి గది లో ఇతర ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలను నిర్ధారించడం.

➤covid-19 జాగ్రత్తలు సూచనలు పాటించడం విద్యార్థులకు అవగాహన పరచడం.

➤ మధ్యాహ్న భోజన పంపిణీ సమయంలో భౌతిక మరియు సామాజిక దూరం పాటిస్తూ అమలు చేయాలి.

➤మధ్యాహ్న భోజనం గుర్తించుటకు ప్రామాణిక నిర్వహణా పద్ధతులు(SOPs) పాటించాలి.

➤ భాగస్వాములను పాల్గొనేటట్లు చేయుట, పేరెంట్స్ కమిటీ సభ్యులు, చురుకైన తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, టీచర్లు పాల్గొనేటట్లు చేయుట.

➤ తాగునీటి సరఫరా/ వ్యర్థాల నిర్వహణ తదితర సమస్యలపై దృష్టి సారించాలి.

➤  అమ్మ ఒడి ద్వారా సేకరించిన అమౌంట్ తో పాఠశాల పారిశుద్ధ్య కార్మికురాలు ద్వారా ఎప్పటికప్పుడు పాఠశాల ఆవరణను తరగతి గదులను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడం.

➤ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు తప్పకుండా చెల్లించుట నిర్ణయాలు తీసుకోవడం.

➤ప్రతి పాఠశాల యందు covid-19 సంబంధించిన ఫ్లెక్సీ, మరియు పోస్టర్లు,శానిటైజర్ ధర్మ ల్ స్క్రీనర్ లు, ఉండేలా చూడడం.

➤విద్యార్ధి,ఉపాధ్యాయులు పాఠశాలలో చేరి ఇతర వ్యక్తులు మాస్కు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవడం.

➤ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు covid 19 పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను, మార్గదర్శకాలను పాటిస్తూ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.



*

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND