కౌశల్-2020 పోటీలకు సన్నాహాలు
- నెలాఖరు వరకు దరఖాస్తుకు గడువు
- వచ్చే నెలలో విద్యార్థులకు ప్రతిభాన్వేషణ పోటీలు
- పోటీ : కౌశల్-2020
- ఎవరికి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9, 10 తరగతుల విద్యార్థులకు.
- పోటీలివే: సైన్స్ క్విజ్, పోస్టర్ ప్రజంటేషన్
➤ఎంతమంది పాల్గొనాలంటే: ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రతి పాఠశాల నుంచి 10 మందికి పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. పాఠశాల స్థాయిలో ఆయా తరగతుల్లో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థుల్ని బృందంగా ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి క్విజ్ పోటీలకు 36 బృందాలు హాజరవుతాయి. వాటిలో ఎంపికైన వారు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారు.
➤ఎప్పుడు: పాఠశాల స్థాయి పోటీలు ఫిబ్రవరి 8న, జిల్లా స్థాయి పోటీలు అదే నెల 16న, రాష్ట్రస్థాయి పోటీలు 27న నిర్వహిస్తారు.
➤రాణిస్తే: జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల విజేతలకు నగదు బహుమతులు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను అందజేస్తారు. సైన్స్‌లో మరింతగా రాణించేలా ప్రోత్సహిస్తారు. విజేతలకు రాష్ట్ర గవర్నర్ బహుమతులు అందజేస్తారు.
➤దరఖాస్తు ఇలా : ఆసక్తి గల విద్యార్థులు తమ వివరాలను www.bvmap.org వెబ్‌సైట్‌లో ఈ నెల 31వ తేదీ లోపు నమోదు చేసుకోవాలి.
పాఠశాల స్థాయి:
పూర్తిగా Online లో 8,9&10త. వారికి తరగతికి 10 మంది విద్యార్థులను అనుమతించబడును. ఆన్ లైన్ లో పరీక్ష వ్రాయుటకు వీలుగా స్మార్ట్ ఫోన్లు సమకూర్చుకొనవలెను.
ఆన్ లైన్ పరీక్ష లింక్ మరియు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లు రిజిష్టర్ అయిన పాఠశాలలకు పంపబడును. ఆన్ లైన్ పరీక్ష 8,9,10 తరగతులకు విడివిడిగా ది 9 ఫిబ్రవరి 2021 న నిర్వహించబడును..తరగతి టాపర్స్ ముగ్గురితో పాఠశాల టీమ్ ఎంపిక అవుతుంది. పాల్గొన్న వారందరికీ డిజిటల్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.
జిల్లాస్థాయి:
జిల్లాలో అత్యధిక స్కోర్ సాధించిన (24/36) పాఠశాల టీమ్ లు జిల్లాస్థాయి పోటీకి అర్హులు. ఆఫ్ లైన్ లో డిజిటల్ స్క్రీన్ పై క్విజ్ నిర్వహించబడుతుంది. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, 3 ప్రోత్సాహక బహుమతులు, మిగిలిన వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.
రాష్ట్రస్థాయి:
జిల్లాస్థాయిలో ప్రధమ, ద్వితీయ స్థానం పొందిన టీమ్ లు రాష్ట్రస్థాయికి అర్హులు. వీరికి డిజిటల్ స్క్రీన్ పై క్విజ్ నిర్వహించబడుతుంది. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, 3 ప్రోత్సాహక బహుమతులు, మిగిలిన వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.
---------------------------------------
------------------------------------
Key Points
➧Koushal Registration Started!
➧Registration Closes on Jan-31-2021
➧Online Examination Feb-9-2021
➧District Competition on Feb-16-2021
➧State Competition On Feb-27-2021
STUDY METERIAL
TELUGU
- CV RAMAN - Pride Of India
- Indian Contribution to science
- JC Bose
- Vikram Sarabhai
- Srinivasa Ramanujan
- Megnad Saha
ENGLISH
No comments:
Post a Comment