నేడు తల్లుల ఖాతాల్లోకి ‘అమ్మఒడి’
నెల్లూరులో విడుదల చేయనున్న సీఎం జగన్
44.49 లక్షల మందికి రూ.6,673 కోట్ల లబ్ధి
అమ్మ ఒడి’ పథకం కింద రెండో ఏడాది నిధుల చెల్లింపులను ప్రభుత్వం సోమవారం చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున రూ.6,673 కోట్లు జమ చేయనుంది. నెల్లూరులో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీట నొక్కి నిధులు విడుదల చేస్తారు. ఈ పథకం కింద గతేడాది 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,336 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దఫా ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా నిబంధనలు సడలించింది. ‘కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు 75% హాజరు నిబంధనను సడలించాం. కుటుంబ ఆదాయ పరిమితిని నెలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.5వేల నుంచి రూ.6,250కు, పట్టణ ప్రాంతాల్లో రూ.10వేల నుంచి రూ.12వేలకు పెంచాం. రెండున్నర ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల్లోపు మెట్ట భూమి పరిమితిని.. మూడెకరాల మాగాణి, 10 ఎకరాల మెట్టకు మార్పు చేశాం. విద్యుత్తు వాడకానికి సంబంధించి గతంలో నెలకు 200 యూనిట్లు వినియోగించే వారిని అర్హులుగా గుర్తించగా.. ఈ దఫా 300 యూనిట్లు వాడే వారికీ వర్తింపజేశాం. పారిశుద్ధ్య కార్మికులు, టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు ఉన్న వారి పిల్లలకూ లబ్ధి కలుగుతుంది. పురపాలిక పరిధిలో వెయ్యి చదరపు అడుగుల స్థిరాస్తి ఉన్న వారినీ అర్హులుగా గుర్తిస్తున్నాం’ అని వివరించింది. ‘నాడు- నేడు’ అమలులో భాగంగా ప్రభుత్వ పరిధిలోని 45వేల పాఠశాలలు, 471 జూనియర్ కళాశాలలు, 151 డిగ్రీ కళాశాలలు, 3,287 వసతి గృహాలు, 55,607 అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మారనున్నాయి. ఆధునికీకరణలో భాగంగా రూ.14 వేల కోట్లు ఖర్చు చేయనున్నామ’ని ప్రభుత్వం తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనవద్దు
పంచాయతీరాజ్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అమ్మఒడి పథకం కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొనకూడదని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఆదేశాలిచ్చారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రమే పాల్గొనాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు హాజరుకావచ్చని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో సోమవారం అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, జగనన్న విద్యా కానుక కింద అందించే ఏకరూప దుస్తుల కుట్టుకూలీ, వర్క్‌బుక్కుల వినియోగంపై తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు
Please ammavodi
ReplyDelete