ఆన్లైన్లో డిగ్రీ అడ్మిషన్లు
నేటి నుంచి 17 వరకు తొలి విడత రిజస్ట్రేషన్లు
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ కళాశాలల్లో అన్ని యూజీ ప్రోగ్రామ్స్ కు ఆన్ లైన్ ద్వారా అడ్మిషన్లు కేటాయించడం జరుగు తుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. కె. హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు మొదటి ఫేజ్ లో అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల ఆరో తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు https://oamdc. ap.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 152 ప్రభుత్వ 120 ప్రైవేట్ ఎయిడెడ్, 1062 ప్రైవేట్ అన్ఎయిడెడ్, 2 యూనివర్సిటీ కళాశాలలు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్ లైన్ అడ్మిషన్లు స్వీకరిస్తాయన్నారు. నోటిఫికేషన్ ఆరో తేదీన విడుదల అవుతుందని, వెబ్ ఆప్షన్స్ 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఎంచుకోవచ్చని , ఫేజ్-1 కోసం హెల్ప్ లైన్ సెంటర్లు ఆరో తేదీ నుంచి 12వ తేదీ వరకు పని చేస్తాయన్నారు. ప్రత్యేక కేటగిరి సర్టిఫికెట్ల పరిశీలన 11, 12 తేదీల్లో ఉంటుందన్నారు. ఈ నెల 20న ఫేజ్ 1 సీట్ల అలాట్మెంట్ జరుగుతుందని చైర్మన్ హేమచంద్రారెడ్డి సూచించారు.
No comments:
Post a Comment