స్కూళ్ల నుంచి 'స్వదేశీ' ఉద్యమం
'ఆత్మ నిర్బర భారత్' నినాదంలో భాగంగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంచడంలో భాగంగా స్వదేశీ ఉద్యమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల నిర్వహించిన 'మన్ కీ బాత్'లో పిలు పునిచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) టాయ్ ఫెస్టివల్ (బొమ్మల ఉత్సవం)కు రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమం ద్వారా స్వదేశీ ఉద్యమానికి స్కూళ్ల నుంచి శ్రీకారం చుడుతున్నారు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు ఈ ఫెస్టివల్ను వర్చువల్ విధానంలో నిర్వహిం చనున్నారు. ప్రస్తుతం దేశంలో పిల్లలు ఆడుకునే బొమ్మల్లో 80 శాతం చైనా నుంచి దిగుమతి అవుతున్నవే. దేశీయంగానే బొమ్మల రూపకల్పనకు వీలైన ఆలోచనలు పెంపొందించడం, విద్యా కార్యక్రమాలకు వీలైన విధంగా వాటిని తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ టాయ్ ఫెస్టివల్ ఎన్సీఈఆర్టీ నిర్వహించనుంది. ఇందుకోసం 75 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. అందులో ఏపీ నుంచి ఒకటి ఉండనుంది. సోమ వారం రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, హెచ్ఎంలతో యూట్యూబ్ ద్వారా నిర్వ హించిన సమావేశంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.
No comments:
Post a Comment