అమ్మఒడి రీ వెరిఫికేషన్‌కు సర్వర్ సమస్య
అమ్మ ఒడి అర్హుల జాబితా పై మరో దఫా వెరిఫికేషన్‌కు సర్వర్ సమస్య తలెత్తింది. పాఠశాల స్థాయిలో హెచ్‌ఎం అధ్యక్షతన ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఇది సోమవారం సాయంత్రానికి పూర్తి కావాలి. జిల్లాలో అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు తల్లులతో కూడిన జాబితాను రీ వెరిఫికేషన్‌కు పాఠశాలలకు పంపి ఆది, సోమ వారాల్లో పరిశీలన పూర్తి చేయాలని విద్యా శాఖ సూచించింది. గత ఏడాది లబ్ధిదారులు ఇచ్చిన బ్యాంక్ ఖాతా, ఆధార్, తల్లి లేదా సంరక్షకుల పేర్లు, రేషన్ కార్డుల్లో మార్పులుంటే.. వాటి తుది నిర్ధారణ తర్వాత అమ్మ ఒడి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే అధికా రాలను హెచ్‌ఎంలకు అప్పగించారు. ఇలా తుది నిర్థారణ చేసిన రీవెరిఫికేషన్ జాబితా అప్‌లోడ్‌కు ఓటీపీ ఇవ్వడం, త్రిసభ్య కమిటీ సంతకాలు తీసుకున్న అనంతరం జాబితాలను అప్ లోడ్ చేయాల్సి రాగా, సర్వర్ సమస్య కారణంగా పురోగతికి బ్రేక్ పడింది. తుది జాబితా 7, 8 తేదీల్లో విడుదలవనుంది.
No comments:
Post a Comment