ఏపీలో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్ళ ప్రారంభానికి సర్కార్ ఏర్పాట్లు... నాడునేడు లో భాగంగా భారీ మార్పులు..
- ఆంధ్రప్రదేశ్‌లో ప్రీ ప్రైమరీ స్కూల్స్ ( అంగన్‌వాడీ కేంద్రాలు) పున: ప్రారంభం అవ్వనున్నాయి.
- ఫిబ్రవరీ 1వ తేదీన ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఆరంభించడానికి ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది.
ప్రీ ప్రైమరీ స్కూల్స్‌లో సౌకర్యాలు ఇవి:
- ప్రతి చిన్నారికి పుస్తకాలు, ప్రీ స్కూల్ కిట్స్, కలర్ కార్డులు, బిల్డింగ్ బ్లాక్స్, ఫ్లాష్ కార్డులు, పోస్టర్లు, చార్ట్స్, లెర్నింగ్ కిట్స్
- మధ్యలో చిన్నారులు విశ్రాంతి తీసుకోవడానికి గంటన్నర పాటు విరామం
- శుద్ధి చేసిన త్రాగునీరు సరఫరా
- పిల్లలకు బలమైన పౌష్టికాహారం
- రీడింగ్, స్టోరీ టైం, స్టోరీ టెల్లింగ్, క్రియేటివ్ యాక్టివిటీ తదితర అంశాలతో పిల్లలకు విద్యాబోధన
- ‘నాడు-నేడు’ స్కీమ్ కింద ఏపీలోని అంగన్‌వాడీ సెంటర్లను గవర్నమెంట్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చివేసింది. ప్రభుత్వ పాఠశాలల తరహాలో విప్లవాత్మకమైన మార్పులు చేసింది.
అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించింది.
➧అన్ని వసతులతో పాటు పౌష్టికాహారం కూడా పిల్లలకు అందించబోతోంది.
➧నాడు-నేడు కింద.. ఏపీలో మొత్తం 55,608 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి ద్వారా 3 నుంచి 6 ఏళ్ల వయసున్న దాదాపు తొమ్మిది లక్షల మంది పిల్లలకు అన్ని వసతులతో కూడిన ప్రీ స్కూల్ విద్యా బోధనను అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
➧ప్రీ ప్రైమరీ స్కూల్స్‌లో ప్రభుత్వం మరుగుదొడ్లను నిర్మించింది. శుద్ధి చేసిన మంచినీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
కావాల్సిన ఫర్నిచర్ సమకూర్చింది.
➧ప్రీ ప్రైమరీ స్కూళ్లను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ-1, వైఎస్సార్ ప్రీ ప్రైమరీ-2, వైఎస్సార్ ప్రీ ఫస్ట్ క్లాస్ తరగతులను ఏర్పాటు చేసింది.
➧నాణ్యమైన విద్యాబోధనతో పాటు పిల్లలకు పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహారాన్ని అందించడానికి నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించింది.
No comments:
Post a Comment