విద్యార్థుల హాజరుపై ప్రత్యేక యాప్
పాఠశాలల్లో విద్యార్థుల హాజరుపై ప్రత్యేక యాప్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజూ విద్యార్థుల హాజరుయామౌనమోదు చేసే విధంగా ఉండాలని, అవిధంగా ఉండటం వలన నేరుగా ఉపాధ్యా యులు, తల్లిదండ్రులు హాజరు చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో హాజరు విషయాలను యాప్లో నమోదు చేస్తామని అధికారులు ఈ సందర్భంగా సీఎం జగన్ కు తెలిపారు. ఈ క్రమంలోనే పిల్లలు స్కూల్ కు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్లాలేలా ఏర్పాటు కూడా చేయాలన్నారు. పిల్లలు స్కూళ్లకు రాని పక్షంలో వాలంటీర్ తో యోగక్షేమాలు కనుక్కోవాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ దీనిపై పర్యవేక్షణ చేయాలని తెలిపారు విద్యాకానుకకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. సకాలంలో విద్యా కానుక అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు స్కూళ్లు తెరిచే నాటికి తప్పనిసరిగా విద్యాకానుక అం దించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఏడోతరగతి వారికి ఇంగ్లిషు మాధ్యమంలో బోధనపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
No comments:
Post a Comment