ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్
➧పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు
➧ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపిన హైకోర్టు
➧వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే షెడ్యూల్ సస్పెండ్ చేస్తున్నామన్న హైకోర్టు
➧పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలంటూ పిటిషన్ వేసిన ప్రభుత్వం
➧ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్
➧హైకోర్టులో ఎస్‌ఈసీ తరఫున వాదిస్తున్న న్యాయవాది అశ్వినీకుమార్
➧ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితి ఉందన్న ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది
➧కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేసింది. పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఏపీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ఏకపక్షంగా ప్రకటించారని పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు షెడ్యూల్ అవరోధం అవుతుందని, ప్రజారోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా షెడ్యూల్ రద్దు చేస్తున్నామని, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కాపాడాల్సిందే.. ప్రజలకున్న హక్కులను కాలరాయలేమని ప్రకటించింది. ప్రభుత్వ వాదనలతో పూర్తిగా ఏకీభవిస్తూ.. ప్రభుత్వం సూచనలను ఎస్‌ఈసీ పట్టించుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
No comments:
Post a Comment