ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 15 న
ఎమ్మెల్యే కోటాలోని ఆరు స్థానాలకుషెడ్యూల్ విడుదల చేసిన ఈసీఐ
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం షెడ్యూల్ ప్రకటించింది. తెలుగుదేశానికి చెందిన గుండుమల తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి, వీవీవీ చౌదరి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందిన మహమ్మద్ ఇక్బాల్ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. వీటితో పాటు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పిల్లి సుభాష్‌చంద్రబోస్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి, చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానానికి కూడా ఎన్నికలు నిర్వహించనుంది. వీటికి సంబంధించి ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మార్చి 4వ తేదీ వరకూ నామినేషన్లు వేయవచ్చు. 5న నామినేషన్ల పరిశీలన, 8వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఉంది. మార్చి 15న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. మార్చి 18వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు. చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానానికి 2023 మార్చి 29 వరకూ గడువు ఉంది.
No comments:
Post a Comment