GOVERNMENT OF ANDHRA PRADESH
పది ప్రశ్నాపత్రంలో మార్పులు
♦కోవిడ్ నేపథ్యంలో సరళంగా రూపకల్పన
♦బ్లూ ప్రింట్ విడుదల చేసిన ప్రభుత్వం
కోవిడ్ కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతోపాటు, పనిదినాల్లో భారీ కోత పడటంతో పరీక్షల నిర్వహ ణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. కీలకమైన పదో తరగతికి సంబంధించి విద్యార్థుల్లో ఉన్న ఆందోళనలు తొలగించేలా సరళంగా రూపకల్పన చేసేలా చర్య లు తీసుకుంది. ఒకవైపు పనిదినాలకు అనుగుణంగా సిలబస్లో కోత విధించ డంతోపాటు, ప్రశ్నాపత్రాల తయారీ విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుం టున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగా 11 పరీక్షా పేపర్ల స్థానంలో ఏడు పేపర్లను తీసుకొచ్చారు
ప్రశ్నలిలా....
ప్రశ్నాపత్రాలు వంద మార్కులకు ఉండనున్నాయి.రెండున్నర గంటలపాటు పరీక్షలు జరుగుతాయి. సెక్షన్- 1లో ఒక మార్కుతో 12 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. 18 నిమిషాలుకేటాయించారు.సెక్షన్-2లో రెండు మార్కులవెరీషార్ట్ . ఆన్సర్ ప్రశ్నలు 8 ఉంటాయి. 24 నిమిషాల్లో రాయవచ్చు. సెక్షన్- 3లో 4 మార్కుల షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు 8 ఉంటాయి. 48 నిమిషాలు కేటాయించారు. సెక్షన్-4లో 8 మార్కుల ఎస్సే ప్రశ్నలు 5 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 12 నిమిషాల చొప్పున గంట సమయం ఇస్తారు. మొత్తం 33 ప్రశ్నలు రెండున్నర గంటల్లో రాయాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వులు ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే వారికే వర్తిస్తాయని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
School Education – Continuous and Comprehensive Evaluation pattern of examination system - Modification in SSC Public Examinations, 2021 to reduce the strain caused to the students due to COVID-19 pandemic - Amendment – Orders – Issued.
G.O.MS.No. 11 Dated: 18-02-2021
No comments:
Post a Comment