Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

JAGANANNA GORUMUDDA(MDM) & SCHOOL SANITATION INSTRUCTIONS

JAGANANNA GORUMUDDA(MDM) & SCHOOL SANITATION INSTRUCTIONS

జిల్లాలో గల అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు మరియు గౌరవ మధ్యాహ్న భోజనం పథకం డైరెక్టర్ గారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకం మధ్యాహ్న భోజన పథకం మరియు స్కూల్ శానిటేషన్. దీనిని IMMS DASHBOARDద్వార  రోజువారీ రివ్యూ చేస్తున్నారు. 

కాబట్టి మధ్యాహ్న భోజన పథకము నకు సంబంధించి ప్రతిరోజు అందరు ప్రధానోపాధ్యాయులు దిగువ తెలిపిన అన్ని పనులు తప్పనిసరిగా చేయవలెను.

INSTRUCTIONS TO HMs

పాఠశాల కు హాజరైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రాప్తికి తప్పనిసరిగా భోజనం  అందించవలెను. అందుకు అవసరమైన గుడ్లు మరియు చెక్కీలు సంబంధిత సరఫరాదారు నుండి పాఠశాలలో స్టాక్ ఉండేవిధంగా ముందుగానే తెప్పించుకొని ఉండవలెను. ఎట్టి పరిస్థితుల్లోనూ మెనూ ప్రకారం మాత్రమే భోజనం పెట్టవలెను.

MEALS TAKEN DETAILS ENTRY IN JAGANANNA GORUMUDDA(MDM) AND IMMS APPs

1. మధ్యాహ్న భోజనం వివరాలను *జగనన్న గోరుముద్ద(MDM)* మరియు *IMMS యాప్* లలో తప్పనిసరిగా విధి గా నమోదు చేయవలెను.

2. యాప్ లో వివరాలు నమోదు చేసేటప్పుడు భోజనం చేసే విద్యార్థులు వారికి సమానంగా గుడ్లు మరియు చెక్కిలు(ఉన్నరోజు) వివరాలు కూడా ఖచ్చితంగా ఎటువంటి వ్యత్యాసం లేకుండా నమోదు చేయవలెను. ఈ విషయంలో లో ఎటువంటి వ్యత్యాసాలు గుర్తించినట్లు అయినా దీనికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించవలసి ఉంటుంది.

INSPECTIONs IN IMMS APP

A) Headmasters

ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు *IMMS* యాప్ లో తప్పనిసరిగా *జగనన్న గోరుముద్ద* మరియు *స్కూల్ శానిటేషన్* inspection from నింపి ఇన్స్పెక్షన్ చేసి సబ్మిట్ చేయవలెను.

B) PMC COMMITTEE

అదేవిధంగా పాఠశాలలో గల తల్లిదండ్రుల కమిటీ కూడా తప్పనిసరిగా మధ్యాహ్న భోజన పథకం మరియు స్కూల్ శానిటేషన్ ఇన్స్పెక్షన్ ను ప్రతి రోజూ చేసే విధంగా ప్రధానోపాధ్యాయులు వారికి తెలియజేయవలెను.

C) WELFARE/WARD EDUCATION ASSISTANT

పాఠశాలకు కేటాయించబడిన వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేక వార్డ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారంలో మూడు రోజులు సోమవారం, బుధవారం, శుక్రవారం, పాఠశాలకు వచ్చి IMMS APP లో తప్పనిసరిగా ఇన్స్పెక్షన్ చేసే విధంగా సంబంధిత వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు తెలియజేయగలరు.

D) VILLAGE ORGANIZER

 అదేవిధంగా గా మీ పాఠశాలకు కేటాయించబడిన విలేజ్ ఆర్గనైజర్ కూడా IMMS APP లో వారంలో మూడు రోజులు మంగళవారం,  గురువారం,  శనివారం, మీ పాఠశాలను సందర్శించి తప్పనిసరిగా యాప్ లో ఇన్స్పెక్షన్ చేసే విధంగా కోరగలరు.


పై అన్ని అంశాలు చాలా ముఖ్యం గా భావించి అందరు ప్రధానోపాధ్యాయులకు విధిగా అనుసరించవలసినదిగా కోరడమైనది.

అందరూ ఉప విద్యాశాఖ అధికారులకు మరియు మండల విద్యాశాఖ అధికారులకు తెలియజేయునది ఏమనగా పై అంశాలపై తమ డివిజన్ మరియు మండల పరిధిలోగల అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విధిగా అన్ని  సూచనలు పాటించే విధంగా తగు ఆదేశాలు జారీ చేసి IMMS    డాష్ బోర్డు ( http://jaganannagorumudda.ap.gov.in/MDM/MDMDashBoardNew.aspx ) ఈ లింక్ ద్వారా ప్రతిరోజు రిపోర్ట్ చూస్తూ ఏ ప్రధానోపాధ్యాయులు అయితే పై విషయాలను పాటించడంలేదో గుర్తించి వారికి తగు ఆదేశాలు జారీ చేసి తప్పనిసరిగా అందరూ విధిగా మధ్యాహ్న భోజనం మరియు స్కూల్ శానిటేషన్ పాఠశాలలో అమలు పరిచే విధంగా చూడవలసిందిగా కోరడమైనది.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND