ఇక ఉదయం 9 గంటల నుంచే పాఠశాలలు
పాఠశాలల వేళలపై గురువారం ఉత్తర్వులు జారీ
➧రాష్ట్రంలోని పాఠశాలలన్నీ ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
➧ఉదయం వేళ సాధ్యమైనంత త్వరగా స్కూళ్లలో బోధన ప్రారంభించడం మంచిదని సూచించారు. ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం బాగా ఉంటుందని, వారి మెదడు కూడా విషయాలను శీఘ్రంగా గ్రహించగలుగుతుందని, ఆ సమయంలో పాఠ్యబోధన సాగిస్తే పిల్లలు ఆయా అంశాలను త్వరితంగా, లోతుగా అవగాహన చేసుకోగలుగుతారన్నారు.
➧ప్రపంచంలో పాఠశాలలన్నీ ఉదయం 8 లేదా 8.30 గంటలకల్లా ప్రారంభమవుతున్నాయని, అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఆలస్యంగా 9.30కు ప్రారంభం కావడం వల్ల అనుకున్న ఫలితాలను సాధించడానికి వీలుండదన్న చర్చ జరిగింది. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని పరిష్కరించుకొని రాష్ట్రంలో కనీసం 9 గంటలకల్లా స్కూళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
➧ఉదయం త్వరగా ప్రారంభించి, ఆ మేరకు సాయంత్రం త్వరగా తరగతులు ముగించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాగా, పాఠశాలల వేళలపై గురువారం ఉత్తర్వులు జారీ చేస్తామని విద్యాశాఖ అధికారులు వివరించారు.
PROCEEDINGS OF DIRECTOR, SCHOOL EDUCATION, AP PRESENT: SRI V.CH.VEERABHADRUDU, IAS
Rc.No.151/A&I/2020
ORDER
The attention of all Regional Joint Directors of School Education and the District Educational Officers in the State is invited to the reference 6th & 8th citeda informed that, the undersigned has accorded permission for reopening ofs (classes 1st to 10th) as per the orders of the Government from time tot Further, in partial modification to the orders issued in ref 6th cited, it was ordered that schools will function full day for Classes 1st to 10th daily as per thet prescribed in SCERT Academic Calendar.
2. However, in order to ensure uniform timings for all category of schools and also to ensure that the precious morning hours of the learners are fullyu in the schooling, the following revised school timings shall be followed with immediate effect.
No comments:
Post a Comment