16 న జగనన్న విద్యా దీవెన
జగనన్న విద్యా దీవెన కింద బోధనారుసుముల విడుదల కార్యక్రమాన్ని ప్రభుత్వం ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. తొలుత ఈ నెల 9వ తేదీనే నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే.. డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ తొలి ఏడాది విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియ పూర్తికానందున వాయిదా వేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో తొలి త్రైమాసికానికి సంబంధించి బోధనారుసుముల్ని ప్రభుత్వం ఏప్రిల్ 16న విడుదల చేస్తోంది. ఈ సారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే ఈ మొత్తాలను జమ చేయనుంది.
No comments:
Post a Comment