పదోతరగతి పరీక్ష 3.15 గంటలు సమయం పెంచిన ప్రభుత్వం
పదో తరగతి పరీక్షల సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది పరీక్షలను ఏడు పేపర్లుగా నిర్వహిస్తున్నారు. వంద మార్కులకు నిర్వహించే తెలుగు, ఆంగ్లం, హిందీ, గణితం, సాంఘిక శాస్త్రం పరీక్షలకు సమయం 3.15గంటలు ఉంటుంది. మూడు గంటలు పరీక్ష రాసేందుకు, 15నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకునేందుకు ఇస్తారు. సామాన్య శాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు పేపర్-1 (50మార్కులు), జీవశాస్త్రం పేపర్-2 (50మార్కులు)గా ఇస్తారు. దీనికి గతంలోలాగే 2.45గంటలు సమయం ఉంటుంది. కాంపొజిట్ కోర్సు పేపర్-2కు 1.45గంటలు, ప్రధాన భాష సబ్జెక్టులకు 3.15గంటలు, వృత్తి విద్యా కోర్సులకు 2 గంటల సమయం ఉంటుంది.
- టెన్త్ పరీక్షకు అదనంగా అరగంట
- సమయాన్ని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
- కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో నిర్ణయం
- ఇప్పటికే 11 పరీక్ష పేపర్లు 6కు కుదింపు
కరోనా మహమ్మారి కారణంగా పదో తరగతి పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించిన ప్రభుత్వం తాజాగా పరీక్షల సమయాన్ని పెంచింది. జూన్లో జరగనున్న పబ్లిక్ పరీక్ల సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం శుక్రవారం ఈ మేరకు సవరణ ఉత్తర్వులు జారీచేసింది. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ధర్డ్ లాంగ్వేజ్, మాథ్స్ సోషల్ స్టడీస్ పరీక్షల సమయాన్ని అర గంట పెంచింది. వీటిని 3.15 గంటల కాలవ్యవధితో నిర్వహిస్తారు. ఈ పరీక్షలను 100 మార్కులకు నిర్వహిస్తారు. 50 మార్కులకు నిర్వహించే ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ పరీక్షల సమయాన్ని కూడా ప్రభుత్వం అరగంట పెంచింది. ఈ పరీక్షలను 2:45 గంటల కాల వ్యవధిలో నిర్వహి స్తారు. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు) పరీక్షల సమయం 1.45 గంటలు ఉంటుంది. ఓఎస్ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్ సబ్జెక్టులు (సంస్కృతం, అరబిక్, పర్సియన్) పేపర్-1, 2 పరీక్షల సమయం 3:15 గంటలు ఉంటుంది. ఎస్ఎస్ సీ ఒకేషనల్ కోర్సు పరీక్ష కాలవ్యవధి 2 గంటలు ఉంటుంది. కొవిడ్ -19 నేపథ్యంలో పరీక్షల కాలవ్యవధిని సవరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 18న ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.11 జారీచే సింది. ఇప్పుడు సదరు ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు (జీవోఎంఎస్ నం.29) జారీ చేశారు.
No comments:
Post a Comment