ఉద్యోగాల జాతర
- రేపు క్యాలెండర్ విడుదలకు సన్నాహం
- పోలీస్ శాఖలో 6,000 పోస్టులు
- సచివాలయాల్లో 8,402 పోస్టులు
- పశు సంవర్ధక శాఖలో 6,099
- ఇతర శాఖల్లోని ఖాళీల భర్తీకి సమాయత్తం
నూతనతెలుగు సంవత్సరాది రోజున రాష్ట్ర ప్ర భుత్వం చదువుకుని ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులకు తీపి కబురు చెప్ప బోతోంది. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసేందుకు సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు ఆయా శాఖలకు చెందిన అధికారులకు ఖాళీల వివరాలను అందిం చాలని ఆర్థిక శాఖ ఆమోదం పొందేలా చూడాలని కూడా ఆదేశాలు జారీచేశారు ఈ నేపథ్యంలో ఉగాది రోజున ఉద్యో గాల జాతర ప్రారంభం కానుందని నిరుద్యోగ యువతీ యువకులు ఆనంద డోలికల్లో మునిగిపోతున్నారు. ఉద్యో గాల భర్తీ క్యాలెండర్ ను కూడా ఆయన ఆరోజు ఆవిష్కరించే అవ కాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
➤రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు. ఈ ఖాళీలను ఏపీపీఎస్సీకి పంపి క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామని ఆయన చెప్పారు త్వరలో పూర్తి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించా రు. అలాగే.. ఎంపీడీవోల పదోన్నతులపై ప్రతిపా దనలు సి ద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న 8,402 పోస్టులను యుద్ద ప్రాతిపదికన భర్తీ చే సేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఉగాది రోజునవిడుదల చేసే క్యాలెండర్ లో ఇవి కూడా ఉండబోతున్నాయి రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యులు
➤సచివాలయాల్లో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్స్ (ఏహెచ్ఏ) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ విషయం తెలిసిందే. వెటర్నరీ వైద్యులు తప్పనిసరిగా చేసిన నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆర్బీకేల్లో కూడా సేవలందించాలని, ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 6,099 యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్స్ (ఏహెచ్ఏ) పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ రిక్రూబ్మెంట్ ఇచ్చారు. వెంటనే రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. అలాగే వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ లాక్కు సంబంధించి 2021 జూన్ 1 నాటికి భవనాలన్నీ సిద్ధం కావాలని ఆదేశించారు ఈ సందర్భంగా, కొత్తగా 21 ల్యాబ్ టె క్నీషియన్స్, 21 ల్యాబ్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. ఈ సంవత్సరం పోలీసు శాఖలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న 6 వేల పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఇటీవలే అనుమతినిచ్చారు. వీటి భర్తీకి సంబంధించిన అంశాలపై క్యాలెండర్ సిద్ధం చేయాలని సీఎం జగన్ కొద్ది రోజుల క్రితం అధికారులను ఆదేశించారు
86 జేఎల్‌ఎం జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో గ్రామ, వార్డు సచివాలయాల కింద 86 ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్ఎం గ్రేడ్-2) పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే పౌర సరఫరాల శాకలో 34 పోస్టులను భర్తీ చేయనున్నారు.
No comments:
Post a Comment