కేసులను బట్టి బడులపై నిర్ణయం: మంత్రి సురేష్
రాబోయే రోజుల్లో కరోనా కేసుల పరిస్థితిని అనుసరించి పాఠశాలల నిర్వహణ, పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత విషయంలో విద్యాశాఖ శ్రద్ధ తీసుకుంటోందని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉందని తెలిపారు. పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంతకు ముందే షెడ్యూల్ ఇచ్చామని, ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
No comments:
Post a Comment