Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు 

ప్రశ్న

ఒక ఉపాధ్యాయుడు SA క్యాడర్ లో 12 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసాడు. అయితే Departmental Test E.O.T/G.O T పరీక్షలు పాస్ కాలేదు.తదుపరి పాస్ అయితే 12 సంవత్సరాల స్కేల్ ఎప్పటినుండి ఇస్తారు??

జవాబు

F.R-26(a) క్రింద గల రూలింగ్ 2 ప్రకారం చివరి పరీక్ష మరుసటి తేది నుండి 12 సంవత్సరాల స్కేలు మరియు ఆర్ధిక లాభం ఇవ్వాలి.                 

ప్రశ్న

పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలలో Spl.Language Tests Telugu,Hindi,Urdu ఎవరు రాయాలి?

జవాబు

ఇంటర్మీడియేట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవనివారు Spl.Language Test in Telugu(P.code-37) రాయాల్సి ఉంటుంది.

10వ తరగతి ఆ పై స్థాయిలో హింది/ఉర్దూ ఒక భాషగా చదవని వారు Spl.Language Test in Hindi/Urdu రాయాల్సి ఉంటుంది.         

ప్రశ్న

సరెండర్ లీవ్ ను నెలలో ఎన్ని రోజులకు లెక్కగడతారు? 11 రోజుల సంపాదిత  సెలవులున్నను లీవ్  సరెండర్ చేసుకోవచ్చునా?

జవాబు

G.O.Ms.No.306 Fin Dept Dt:8-11-1974ప్రకారం సదరు నెలలో 28/29/30/31 ఎన్ని రోజులున్నను,రోజులతో నిమిత్తం లేకుండా 30 రోజులకు మాత్రమే లీవ్ సరెండర్ లెక్కగట్టి నగదు చెల్లిస్తారు.

G.O.Ms.No.334 F&P,Dt:28-9-1977 లో ఇలా వుంది Leave may be surrendered at any time not exceeding 15/30 days...అని వున్నది.అందుచేత 11రోజులు సరెండర్ చేసుకుని నగదు పొందవచ్చ

ప్రశ్న

నేను ప్రస్తుతం SGT గా పనిచేస్తున్నాను.రాబోయే DSC లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే,DEO గారి అనుమతి తీసుకోవాలా?

జవాబు

అవును తప్పనిసరిగా నియామకాధికారి అనుమతి తీసుకోవాలి.

ప్రశ్న

"లీవ్ నాట్ డ్యూ" ఎపుడు మంజూరు చేస్తారు??

జవాబు

1933 APLR రూల్స్ లోని రూల్ 18-సి ప్రకారం ఉద్యోగి ఖాతాలో ELs గానీ, హాఫ్ పే లీవ్ గానీ లేనప్పుడు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా వీటిని మంజూరు చేయవచ్చు. ఇలా మంజూరు చేసిన సెలవును భవిష్యత్ లో అతనికి వచ్చే సెలవు నుండి మినహాయిఇస్తారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND