GROUP INSURANCE SCHEME - RULES IN BRIEF
గతంలో అమలులోవున్న " కుటుంబ సంక్షేమ పధకం " స్థానంలో జి .ఓ ఎం .ఎస్ నం .293 ఆర్ధిక , తేది : 08-10-1984 ద్వారా " ఆంధ్ర ప్రదేశ్ ఎంప్లాయిస్ గ్రూప్ స్కీము 1984 " 01-11-1984 నుండి ప్రవేశ పెట్టబడింది .
నిబంధనలు : 01-11-1984 నాటికి సర్వీసులో గల ప్రభుత్వ , పంచాయితీ రాజ్ , మున్సిపల్ ఉద్యోగులు మరియు 10 సంవత్సరములు నిండి ప్రభుత్వోద్యోగులుగా మారిన వర్క్ చార్జిడ్ ఉద్యోగులు ఈ పధకంలో సభ్యులు .
GROUP INSURANCE SCHEME - RULES IN BRIEF
1. ఆరంభం: గతంలో అమలలులో ఉన్న 'కుటుంబ సంక్షేమ పథకము' (FBF) స్థానంలో G.O.Ms. No.293 Fin.Dt: 8-10-1984 ద్వారా 'ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిస్ గ్రూప్ ఇన్యూరెన్స్ స్కీము 1984 ఆను క్రొత్త స్కీము తేది: 1.11.1984 నుండి ప్రవేశ పెట్టిబడినది. పాత FBF పథకంలో అప్పటివరకు ఉద్యోగి చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో కలిపి రిటైరైనప్పుడు లేక చనిపోయినప్పుడు చెల్లిస్తారు. ప్రతి PRC లోను గ్రూప్ ఇన్యూరెన్స్ స్లాబు రేట్లను సవరిస్తూ వస్తున్నారు. RPS 2010 G.O.Ms.No.225 F&P Dt: 22-6-2010 ద్వారా 6/2010 నుండి స్లాబ్ రేట్లను పెంచారు.
2. నిబంధనలు: 1.11.84 నాటికి సర్వీసులో గల ప్రభుత్వ, పంచాయితీరాజ్, మున్సిపల్ ఉద్యోగులు మరియు 10సం|| నిండి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన వర్క్ ఛార్జ్ డ్ ఉద్యోగులు పథకంలో సభ్యులు. 1.11.1984 తరువాత సర్వీసులో చేరిన వారు తదుపరి నవంబరు నుండి మాత్రమే సభ్యులగుదురు. అయితే అట్టివారికి ఇన్సూరెన్స్ కవరు చేయడానికి వారు ఏ గ్రూపుకు చెందుతారో దానిని బట్టి ప్రతి యూనిట్‌కు రూ.4.50 పై.లను తాత్కాలికంగా తదుపరి అక్టోబరు వరకు
చెల్లించాలి. ప్రతి ఉద్యోగి ఫారం 6 లేక 7లో ఇచ్చిన నామినేషన్‌ను సర్వీసు రిజిస్టరులో అంటించి, నమోదు చేయించి
అధికారి సంతకం తీసుకోవాలి.
3. సభ్యత్వ రుసుము: ఉద్యోగులు వారి వారి వేతన స్కేలు యొక్క గరిష్ట పరిమితి బట్టి ఈ క్రింది పట్టికలో సభ్యత్వ
విధముగా ఎ.బి.సి.డి.లను నాలుగు గ్రూపులుగా విభజించబడుదురు. 1.11.1994 నుండి యూనిట్ సభ్యత్వ రుసుము
G.O.367 Fin. Dt: 15-11-1994 ప్రకారం రూ.15/-లుగా పెంచబడినది.
G.O.Ms.No. 193 F&P Di: 18.11.1999 ద్వారా పెంచబడిన స్లాబ్ రేట్లు G.O.Ms.No.24 Edn. Dt: 15.2.2001 ద్వారా యథాతథంగా ఎయిడెడ్ వారికి అమలు జరుపబడినవి.
4. సభ్యుత్వ గ్రూపు మార్పు: ఒక ఉద్యోగి సంవత్సరం మధ్యలో పొందిన రెగ్యులర్ ప్రమోషన్ లేక నియామకం వలన అతని వేతన స్కేలు గరిష్ట పరిమితికి మారినను తదుపరి నవంబరు నుండి మాత్రమే అతని సభ్యత్వము గ్రూపు మారుతుంది. ఎయిడెడ్ వారి విషయంలో జూలై నుండి మాత్రమే మారుతుంది. ప్రమోషన్ వెనుకటి
తేది నుంచి అమలలులోనికి వచ్చినప్పటికీ సభ్యత్వ గ్రూపు వెనుకటి తేది నుండి మారదు. మార్పును ఎప్పటికప్పుడు సర్వీసు పుస్తకంలో నమోదు చేయించుకోవాలి.
5. ఇన్సూరెన్స్ లేక సేవింగ్ ఖాతాలకు జమ: ఉద్యోగి చెల్లించే రూ.10/- యూనిట్ నుండి రూ.3.125 ఇన్సూరెన్స్ ఖాతాకు రూ.6.875/- సేవింగ్స్ ఖాతాకు ప్రతి రూ.15/- యూనిట్ నుండి రూ.4.50 ఇన్సూరెన్స్ ఖాతాకు, రూ.10.50 సేవింగ్స్ ఖాతాకు జమ చేస్తారు.
6. ఇన్సూరెన్స్ అండ్ సేవింగ్ మొత్తములు చెల్లింపు : ఉద్యోగి సర్వీసులో నుండగా మరణిస్తే ఆతని సభ్యత్వ గ్రూపును
బట్టి ఎంత రుసుము చెల్లిస్తున్నారో అన్ని వేల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ మొత్తంతోపాటు సేవింగ్స్ మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తారు. ఉద్యోగి రిటైరైనా లేక రాజీనామా చేసినా సేవింగ్స్ మొత్తాన్ని మాత్రమే G.P.F. కు వర్తించే వడ్డీరేటుతో కలిపి చెల్లిస్తారు.
7. ఎయిడెడ్ పాఠశాలలోని ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందిని G.O.Ms.No.315 విద్యాశాఖ, లేది: 22.7 1986
ద్వారా ఇటువంటి స్కీమ్ 1.7.1986 నుండి వర్తింప చేయబడినది. అయితే ఎయిడెడ్ పాఠశాలలకు ఎల్.ఐ.సి. వారే
నేరుగా ప్రీమియంబు వసూలు చేసి, చనిపోయిన వారికి డబ్బు చెల్లిస్తారు. ఎయిడెడ్ యేతర ఉపాధ్యాయులకు ఎల్.ఐ.సి.లో నేరుగా సంబంధం లేదు.
8. చెల్లింపు విధానం: G.O.Ms.No.90 Fin. Dt: 1-5-2014 ప్రకారం ఉద్యోగి రిటైరైనా లేక మరణించినా గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం క్రింద అతను చెల్లించిన ప్రతి యూనిట్ కు సేవింగ్స్ ఖాతా నుండి 3 పట్టికలలో చూపిన విధంగా చూపించబడును. ఈ పట్టికలు ప్రతి సంవత్సరము ప్రభుత్వం విడుదల చేయును. లెక్కించవలసిన విధానము ఒక యూనిట్ కు 1.పథకంలో చేరి 31.10.1994 నాటికి పూర్తయిన సంవత్సరమలను బట్టి ఆనాటికి సేవింగ్స్ ఖాతాలో వడ్డీతో సహా గల నిల్వ మొత్తం (ACS = Accumulated Savings) ను టేబుల్-1 నుండి గుర్తించాలి. 2.సభ్యత్వం ముగియునాటికి సదరు నిల్వ మొత్తంపై లభించెడి వడ్డీని టేబుల్-2లో గుర్తించాలి. 3. 1.11.1994 నుండి సభ్యత్వము ముగియునాటికి లభించు వడ్డీతో కూడిన సేవింగ్స్ మొత్తంను టేబుల్-3గా గుర్తించాలి. ఈ మూడింటిని కలుపగా వచ్చు మొత్తం ఒక యూనిట్ కు చెల్లించబడే అంతిమ మొత్తం అవుతుంది. దానిని యూనిట్ల సంఖ్యచే గుణిస్తే సభ్యునికి అంతిమంగా చెల్లించబడే మొత్తం తెలుస్తుంది. ప్రతి సంవత్సరము జీపీఎఫ్ పైన చెల్లించే వడ్డీకి దీనిని వర్తింప చేస్తారు.
No comments:
Post a Comment