2021-22 అకడమిక్ క్యాలెండర్ తయారు చేయండి.
- టెన్త్, ఇంటర్ పరీక్షల టైం టేబుల్ కూడా
- జూలైలో పరిస్థితి అనుకూలిస్తే నిర్వహణ
- అధికారులతో సమీక్షలో మంత్రి సురేశ్
2021-22 విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను తయారు చేయాలని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశించారు. జూలై నెలలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు పరిస్థితి అనుకూలిస్తే, అందుకు అనుకూలంగా టైం టేబుల్ తయారు చేసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్షలు, ‘నాడు-నేడు’ మొదటి విడత పనులపై మంత్రి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘నాడు-నేడు’ పనుల్లో ముఖ్యంగా ప్రహరీల నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని ఆయన సూచించారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న వాటిని 20వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. 14,971 పాఠశాలల్లో పెయింటింగ్ పనులకు గాను 82 శాతం పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. జాతీయ నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వస్తున్న సందేహాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయుల నుంచి సూచనలు తీసుకుని పరిశీలించాలని సూచించారు. జగనన్న విద్యా కానుక సరఫరా తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్య డైరెక్టర్ వి.చినవీరభద్రుడు, సమగ్ర శిక్ష ఎస్‌పీడీ వెట్రిసెల్వి, ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment