- మూల్యాంకన ప్రక్రియ సహేతుకమే
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల విధానంపై సుప్రీంకోర్టు సంతృప్తి
న్యూఢిల్లీ:పన్నెండో తరగతి విద్యార్థుల ఫలితాలను వెల్లడించేందుకు సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ రూపొందించిన మూల్యాంకన విధానం పారదర్శకంగా, సహేతుకంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందులో జోక్యం చేసుకోవడాని కి ఎలాంటి కారణం కన్పించట్లేదన్న న్యాయస్థానం, మూల్యాంకన విధానాలను ఆమోదిస్తున్నట్లు వెల్లడించింది. 12వ తరగతి విద్యార్థుల వార్షిక ఫలితాలపై సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ బోర్డులు సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ముందు అఫిడవిట్ దాఖలు చేశాయి. విద్యార్థుల ప్రతిభను అంచనా వేసే మూల్యాంకన విధానంలో వివాద పరిష్కార యంత్రాంగాన్ని చేర్చినట్లు పేర్కొన్నాయి. ఫలితాలపై అభ్యం తరాలున్న విద్యార్థుల కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తామ ని సీబీఎస్ఈ తెలిపింది. కమిటీ నిర్ణయంతో కూడా సంతృప్తి చెందని విద్యార్థులకు ఆగస్టు 15- సెప్టెంబర్ 15 మధ్యలో ఆప్షనల్ పరీక్షలు (ప్రధాన సబ్జెక్టులు మాత్రమే) నిర్వహిస్తా మని ప్రమాణ పత్రంలో పేర్కొంది. ఇక, ప్రైవేటు, కంపార్ట్ మెంట్ పరీక్షలు రాసే విద్యార్ధుల మూల్యాంకనంపై కూడా సీబీఎస్ఈ వివరణ ఇచ్చింది. 2019-20 సంవత్సరంలోకోర్టు ఆమోదించిన విధానంలోనే మదింపు ఉంటుందని వెల్లడించింది. ఈ అఫిడవిట్ను పరిశీలించిన న్యాయస్థా నం.. బోర్డుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అయితే కంపార్ట్మెంట్ పరీక్షలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు లో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై కూడా విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రైవేటు, కంపార్ట్మెంట్, రిపీటర్ విద్యార్థులకు పరీక్షలు రద్దు చేయడం కుదరదని తేల్చిచెప్పింది. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత కంపార్ట్మెం ట్ పరీక్షలు నిర్వహిస్తామన్న సీబీఎస్ఈ ప్రణాళికను కోర్టు అంగీకరించింది.
No comments:
Post a Comment