- జులై నుంచి కొత్త (TDS) టీడీఎస్ రూల్
- ఐటీఆర్ (ITR) దాఖలు చేయకుంటే అధిక టీడీఎస్ (TDS) రేటు బ్యాంకుల పరిశీలన
న్యూఢిల్లీ :ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయకపోతే జులై 1, 2021 నుంచి అధిక టీడీఎస్(ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్)/ టీసీఎస్ రేట్ల ప్రకారం చెల్లిం చాల్సి ఉంటుంది. గత రెండు ఆర్థిక సంవత్సరాలు ఐటీఆర్ దాఖలు చేయని వ్యక్తి టీడీఎస్, టీసీఎస్ పరిమితి రూ.50 వేల మించితే వారికి అధిక టీడీఎస్ రేటు వర్తిస్తుంది. బడ్జెట్ 2021లో ప్రకటించిన ఈ నిబంధన జులై 1. 2021 నుంచి ఆచరణలోకి రానుంది. నిబంధనల ప్రకారం.. ఐటీఆర్ దాఖలు చేశారో లేదో బ్యాంకులే పరిశీ లించనున్నాయి.దాఖలు చేయకపోతే రెండు రెట్ల వరకు టీడీఎస్ విధించే అవకాశాలున్నాయి. సరళీకరించి చెప్పాలంటే.. ఒక వ్యక్తి గత ఆర్థిక సంవత్సరాలు 2018-19, 2019-20లకు సంబం ధించిన ఐటీఆర్ దాఖలు చేయలేదనుకుందాం. అయితే ఫిక్సుడ్ డిపాజిట్లు, డివిడెండ్ ఆదాయం, వడ్డీలపై ఆదాయం పొందినప్పుడు టీడీఎస్ రూ.50 వేల మించితే(ప్రతి ఏడాది) ఆ వ్యక్తి ఆదాయాలకు అధిక టీడీఎస్ రేటు వర్తిస్తుంది. ఈ నిబంధన జులై 1, 2021 నుంచి అమల్లోకి వస్తుంది. నిబంధనల ప్రకారం.. కనిష్మటీడీఎస్ 5 శాతం కాగా అధిక టీడీఎస్ 20 శాతంగా ఉంది.
No comments:
Post a Comment