ప్రాక్టికల్ సమస్యలు
ప్రాథమిక పాఠశాలల మ్యాపింగ్‌పై కొనసాగుతున్న కసరత్తు
నూతన విద్యా విధానం అమలుల్లో భాగంగా జిల్లాలోని స్కూలు కాంప్లెక్స్‌ల పరిధి లోని ప్రాఽథమిక పాఠశాలల మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా విద్యాశాఖ వేగవంతం చేసింది. దీనిపై రాష్ట్రస్థాయిలో శుక్రవారం సమా వేశం ఉండడంతో ఆ మేరకు జిల్లాలోని 262 స్కూల్ కాంప్లెక్స్‌ల ప్రధానోపాధ్యాయులకు మొత్తం 2,349 ప్రాఽథమిక పాఠశాలల మ్యాపింగ్ బాధ్యతలను అప్పగిం చారు. మ్యాపింగ్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గూగుల్ ఫారంలలో అప్‌లోడ్ చేయాల్సి ఉండగా, పలుచోట్ల కాంప్లెక్స్‌ల పరిధిలోని పాఠశా లలు ఆన్‌లైన్‌లో కనపడడం లేదని, మరికొన్నిచోట్ల ఒక కాంప్లె క్స్ పరిధిలోని పాఠశాలలు మరో కాంప్లెక్స్ పరిధిలో కనిపి స్తున్నట్టు తెలిసింది. మరోవైపు సంబంధిత గూగుల్ ఫారమ్స్ లింక్‌లు ఓపెన్ కావడం లేదని చెబుతున్నారు. దీంతో కాం ప్లెక్స్‌ల హెచ్‌ఎంలు ప్రాఽథమిక పాఠశాలల విలీనం, సమీప హైస్కూళ్ల దూరం, తరగతి గదుల వసతి వంటి అంశాల నమోదుకు కుస్తీలు పడుతున్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను విడదీసి సమీప యూపీ లేదా హైస్కూళ్లకు తరలించడం వల్ల ఏర్పడే అనర్థాలపై మరింత స్పష్టత వస్తోంది. గరిష్టంగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే హైస్కూళ్లకు 3, 4, 5 తరగతుల విద్యార్థులు రాకపోకలు సాగించడం ప్రాక్టికల్‌గా చాలా సమస్యలు తెచ్చి పెడుతుంది. ఈ నేపథ్యంలో అమ్మఒడి ఆర్థికసాయం కింద ప్రభుత్వం ఇచ్చే రూ.14 వేలతో బోధించేందుకు అందుబాటులో ఉన్న ప్రైవేటు పాఠశాలలు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయని ఉపా ధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అదే జరిగితే నూతన విద్యా విధానం సంస్కరణలు అంతిమంగా ప్రభుత్వ పాఠశాలల తిరోగమనానికి దారితీసినట్టు అవుతుందని భావిస్తున్నాయి. దీనికి బదులు ప్రస్తుతం కొనసాగుతు న్నట్టుగానే 1–5 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లోనే ఉంచి కొత్తగా పూర్వ ప్రాఽథమిక విద్య (నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ)ను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయడం శ్రేయస్క రమని చెబుతున్నారు. వాస్తవానికి గతేడాది ప్రభుత్వం జారీచేసిన సూచనల మేరకు అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాల్లోకి తరలించేందుకు కసరత్తు జరిగిన విషయాన్ని ఉపాధ్యాయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
No comments:
Post a Comment