- టీచర్లకు ఇంగ్లిష్ సర్దిఫికేట్ కోర్సు
- ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా జూలై 19 నుంచి ప్రారంభం
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల లో పనిచేస్తున్న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్ల టీచర్లు తమ ఇంగ్లిష్ ప్రావీణ్యాన్ని మెరుగుపరచుకునేందుకు నెల రోజుల పాటు శిక్షణతో కూడిన సర్టిఫికెట్ కోర్సు అందించాలని ఏపీ సమగ్ర శిక్ష నిర్ణయించింది. విద్యా ర్థులకు నాణ్యమైన విద్యనందించే లక్ష్యంలో భాగంగా దీన్ని అమలు చేస్తోంది. సర్టిఫికెట్ ఇన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్(సీఈఎలీ) శిక్ష ణను అందించనున్నారు. ఈనెల 19 నుంచి ఆగస్టు 17 వరకు నెల పాటు ఆన్లైన్ ద్వారా రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్(సౌత్ ఇండి యా, బెంగళూరు) సంస్థ ఈ శిక్షణ ఇవ్వనుం ది. అర్హులైన వారిని ఎంపిక చేయాలని ఇప్ప టికే అన్ని జిల్లాల విద్యాధికారులకు సమగ్ర శిక్ష ఆదేశాలిచ్చింది. ఈ ట్రైనింగ్కు జిల్లా నుంచి 25 మంది చొప్పున టీచర్లను ఎంపిక చేయను న్నారు. ఆన్లైన్ శిక్షణకు ఆసక్తి వ్యక్తీకరణను టీచర్ల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మహి ళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, విభిన్న ప్రతిభావం తులైన వారికి చోటు కల్పించాలి. కొత్తగా నియ మితులైన టీచర్లకు ప్రాధాన్యమివ్వాలి. ఇంత కుముందు శిక్షణ పొందిన వారిని ఎంపిక చేయకూడదు. 50 ఏళ్లలోపు వయసున్న వారినే ఎంపిక చేయాలి. టీచర్లకు ఇంటర్నెట్ సదు పాయం, ఇతర డిజిటల్ డివైజ్లు అందు బాటులో ఉండాలి. అలాగే ఇంగ్లిష్ బోధిస్తున్న వారిని గుర్తించి డీఈవోలు, ఏపీవోలు ఈనెల 5 లోపు జాబితా పంపించాలని సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.
No comments:
Post a Comment