ఆధార్ కార్డులకు సంబంధించి కొన్ని సర్వీసులు నిలిపివేత
ఆధార్ కార్డులకు సంబంధించి కొన్ని సర్వీసులు నిలిచిపోనున్నాయి. యూఐడీఏఐ తాజాగా వీటిని వెల్లడించింది. ఆధార్ కార్డులో అడ్రస్ వాలిడేషన్ లెటర్ ద్వారా అడ్రస్ మార్చుకోవడం ఇక సాధ్యం కాదు. అలాగే ఆధార్ కార్డు రీ ప్రింట్ సేవలు కూడా అందుబాటులోఉండవు. అడ్రస్ వాలిడేషన్ లెటర్ ఆప్షన్ తొలగించడం వల్ల అద్దెకు ఉంటున్న వారిపై ప్రతికూల ప్రభావం పడొచ్చు.
అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు లేని వారు కూడా ఇకపై అడ్రస్ మార్చుకోవడం కష్టతరం కావొచ్చు. ఇకపోతే ఆధార్ కార్డు రీ ప్రింట్ సర్వీసులు కూడా అందుబాటులో ఉండవు. ఆధార్ రీ ప్రింట్ పొందాలని భావించే వారు పీవీసీ కార్డు రూపంలో మాత్రమే ఆధార్ కార్డు పొందాల్సి ఉంటుంది.
ట్విట్టర్లొ ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా యూఐడీఏఐ ఈ వివరాలను వెల్లడించింది. ఇక... ఆధార్ కార్డులో తప్పులుంటే... వాటిని సులభంగానే మార్చుకోవచ్చు. అడ్రస్, పేరు, పుట్టిన తేదీ వంటి వాటిల్లో తప్పులుంటే ఇంట్లో నుంచే అప్డేట్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ యాడ్ చేసుకోవడం, బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఆధార్ సెంటర్కు వెళ్లాలి.
No comments:
Post a Comment