ఐఆర్ కంటే తగ్గదు ఫిట్‌మెంట్ దానికన్నా మెరుగ్గా !
ఉద్యోగుల వేతనాలు తగ్గవు : సజ్జల
మధ్యంతర భృతి (ఐఆర్) 27 శాతం కంటే తగ్గకుండా ఫిట్‌మెంట్ కొంతమేర పెరిగేట్టు పీఆర్సీపై మళ్లీ కసరత్తు చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో.సీఎస్ సమీర్‌శర్మ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ, జీఏడీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. అనంతరం సజ్జల విలేకరులతో మాట్లాడారు. ‘‘సీఎంకు పీఆర్సీ వివరాలను అందించాం. సీఎస్ కమిటీ సిఫారుసుల ప్రకారం ఉద్యోగుల జీతాలు కొంత మేర తగ్గుతున్నాయని గుర్తించాం. దీంతో ఐఆర్ కన్నా ఫిట్‌మెంట్ కొంత మేర పెరిగేట్టు మళ్లీ కసరత్తు చేయాలని సీఎం ఆదేశించారు. మంగళ, బుధవారాల్లో అధికారులు కసరత్తు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చిస్తారు. ఏమైనా ఈ నెలాఖరుకు మొత్తం ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నాం. ఆ తర్వాతే పీఆర్సీ ప్రకటన ఉంటుంది. ఉద్యోగులు లేనివి ఎక్కవగా ఊహించుకుని ఆ తర్వాత నిరుత్సాపడే కంటే ముందే వాస్తవాలను గ్రహిస్తే మంచిది. ఉద్యోగుల జీతాలు తగ్గవు’’ అని పునరుద్ఘాటించారు
No comments:
Post a Comment