- పాఠశాలల విలీనంపై కౌన్సిళ్ల ఆమోదం తీసుకోండి
- కమిషనర్లకు పురపాలకశాఖ ఆదేశం
పుర , నగరపాలక సంస్థల పరిధిలోని పాఠశాలలను విద్యాశాఖకు బదిలీ చేసేం దుకు రంగం సిద్ధమవుతోంది . పాఠశాలలు , వాటిలో పని చేస్తున్న బోధనా సిబ్బంది , స్థిరాస్తులతో సహా విద్యాశాఖకు బదిలీ చేసేలా పుర , నగరపాలక సంస్థ ల్లోని పాలకవర్గాలతో ( కౌన్సిల్ ) తీర్మానం చేయించాలని కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది . మిగతా ప్రభుత్వ పాఠశాలతోపాటు పురపాలక పాఠశాలల్లోనూ విద్యా కానుక , అమ్మఒడి , జగనన్న గోరుముద్ద , వారధి మొదలైన పథకాలు అమలు చేస్తున్నారు . మున్సిపల్ పాఠశాలలపై పర్యవేక్షణ , పథకాల అమలుకు సంబం ధించి ప్రత్యేక వ్యవస్థ లేనందున ... వాటిని విద్యాశాఖకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది . ఈ మేరకు ఆయా పాలకవర్గాలతో తీర్మానం చేయించాలని కమిషనర్లకు పంపిన ఉత్తర్వుల్లో వివరించింది .
No comments:
Post a Comment