- ఆర్డీటీ సెట్కు దరఖాస్తుల ఆహ్వానం
- ఈ నెల 11 వరకు అవకాశం
అనంతపురం: పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ( ఆర్డీటీ ) ప్రముఖ కార్పొరేట్ కళాశాలల్లో ఇం టర్మీడియట్ ప్రవేశం కల్పించి , ఉన్నత విద్య పూర్తయ్యే వరకు ఆర్థికసహాయం అందిం చనుంది . ఇందు కోసం ఆర్డీటీ సెట్ నిర్వహిం చనుంది . ఆర్డీటీ సెట్కు విద్యార్థులు ఈ నెల 11 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఎడ్యుకేషన్ డైరెక్టర్ మోహన మురళి కోరారు . ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు .
ఆర్డీటీ ప్రాజెక్టుల పరి ధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2021 2022 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అర్హులు . ఈ నెల 19 న ఆర్డీటీ సెట్ నిర్వహించనున్నారు .
ఆర్డీటీ స్పాన్సర్ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదివినా అర్హులే . రాష్ట్ర సిలబస్ ప్రకారం 510/600 మార్కులు సాధించిన , సీబీఎస్ఈ సిలబస్ ప్రకారం 420/500 మార్కులు సాధించిన వారు ఆర్డీటీ సెట్ రాయవచ్చు . విద్యార్థులు జిల్లాలో ఉన్న ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీసుల్లో పదో తరగతి మార్కుల జాబితా ( ఇంటర్నెట్ కాపీ ) , ఆధార్ , బియ్యం కార్డు , కుల ధ్రువీకరణ పత్రం ( ఎస్సీ , ఎస్టీ , బీసీల కు ) , మూడు పాస్పోర్ట్ సైజు ఫొటోలతో దరఖాస్తు అనంతపురం చేసుకోవాలి . అర్బన్ కు సంబంధించిన వారు అనంతపురం ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలోని విద్యా విభాగంలో దరఖాస్తు చేసుకోవాలి . 18 ఏళ్లుగా ఆర్డీటీ సెట్ విజయవంతంగా నిర్వ హిస్తున్నారు . ఇప్పటి వరకు 4,600 మంది విద్యార్థులు ఆర్డీటీ సహకారంతో విద్యనభ్య సించారు . ఆర్డీటీ సెట్పై మరిన్ని వివరాలకు 08554-271353 , 371354 నంబర్లలో సం ప్రదించాలన్నారు
--------------------
Website...
------------------
No comments:
Post a Comment