SBI లో 5008 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 5008 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 225 ఖాళీలున్నాయి.
పోస్టులు: జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)
సర్కిల్ వారీగా ఖాళీలు: అహ్మదాబాద్-357, బెంగళూరు-316, భోపాల్-481, బెంగాల్-376, భువనేశ్వర్-170, చండీగఢ్-225, చెన్నై-362, ఢిల్లీ-152, హైదరాబాద్-225, జైపూర్-284, కేరళ-273, లఖ్‌నవూ/ఢిల్లీ-631, మహారాష్ట్ర/ముంబయి మెట్రో-747, మహారాష్ట్ర-50, నార్త్ ఈస్టర్న్-359
అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/తత్సమానత ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 2022 ఆగస్టు 01 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలు మూడేళ్లు; పీడబ్ల్యూడీ(జనరల్/ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
బేసిక్ పే: నెలకు రూ.19,900
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు:
➢ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.
➣ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 27
➢ప్రిలిమినరీ పరీక్ష: నవంబరు 2022
➣మెయిన్ పరీక్ష తేదీ: డిసెంబరు 2022/జనవరి 2023లో జరుగుతుంది.
-----------------------------------------
వెబ్‌సైట్:https://sbi.co.in/
------------------------------------------
No comments:
Post a Comment