పిల్లలు మెచ్చే పాఠ్యాంశాలు..
సమగ్ర శిక్షా పథకాన్ని రీడిజైన్ చేసిన కేంద్ర ప్రభుత్వం
జాతీయ విద్యా విధానం - 2020సిఫార్సులకు అనుగుణంగా మార్పులు.
ప్రోగ్రామాటిక్, ఫైనాన్షియల్మార్గదర్శకాలతో కొత్త ఫ్రేమ్వర్క్
ప్రీ ప్రైమరీ నుండి సీనియర్ సెకండరీస్థాయి వరకు నాణ్యమైన విద్య
పిల్లలందరికీ ఆహ్లాదకర వాతావరణంలో బోధన.
అభ్యసనప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చేయడమే లక్ష్యం.
పథకంలో 11.6 లక్షల స్కూళ్లు. 15.6 కోట్ల మంది విద్యార్థులు
జాతీయ నూతన విద్యా విధానం - 2020 సిఫార్సుల ప్రకారం సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రీడిజైన్ చేసింది. పిల్లలు మెచ్చేలా, వారు అభ్యసన ప్రక్రి యలో చురుగ్గా పాల్గొనేలా ప్రీ ప్రైమరీ నుండి సీని యర్ సెకండరీ స్థాయి వరకు నూతన విధానాన్ని (ఫ్రేమ్వర్క్) రూపొందించింది. ఆహ్లాదకరమైన తరగతి గదిలో, ఉన్నత ప్రమాణాలు సాధించేలా నాణ్యమైన విద్యను అందించేలా కార్యక్రమాలు రూపొందించింది. విద్యార్థుల విభిన్న సామాజిక పరిస్థితులు, సామర్ధ్యాలు, బహు భాషా అవసరాల ను పరిగణనలోకి తీసుకొంది. ఈ పథకంలో 11.6 లక్షల పాఠశాలలు, 15.6 కోట్ల మంది విద్యార్థులు, 57 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందిస్తుంది. ఈ విధానం లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు, వివిధ శిక్షణ సంస్థలకు సహకారం అందుతుంది. విద్యా కార్యక్రమాల అమలుకు జిల్లాకు రూ.10 నుంచి 20 లక్షల వరకు ఖర్చు చేస్తారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డ్రాపవుట్స్ నివారణ. పునాది అక్షరాస్యత సంఖ్యాశాస్త్రం (ఎఫ్ఎల్ఎన్) అభివృద్ధి. లింగ సమానత్వం. నాణ్యత, వినూత్న ఆవిష్కరణలు, ఉపాధ్యాయుల వేతనాలకు ఆర్ధిక సహకారం. డిజిటల్ కార్యక్రమాలు, యూనిఫారాలు, పాఠ్యపు స్తకాలు మొదలైన వాటికి సహకారం అందిస్తారు. ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)కి వీలుగా కొత్త కార్యక్రమాలకు అవకాశం కల్పిస్తారు. వృత్తి విద్య, క్రీడలు, వ్యాయామ విద్య, ఉపాధ్యాయ శిక్షణను బలోపేతం చేస్తారు. హోలిస్టిక్, 360 డిగ్రీ, మల్టీ డైమెన్షనల్ మోడ్లో విద్యార్థులను తీర్చి దిద్దాలన్నది ఈ విధానం ఉద్దేశం. ఇందుకోసం జాతీయ మూ ల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. బ్యాగ్ లెస్ డేస్, స్కూల్ కాంప్లెక్స్లు, స్థానిక కళాకారు లతో ఇంటర్న్షిప్లు, బోధన సంస్కరణలు ఇందు లో కీలకమైనవి. ఖేలో ఇండియాలో భాగంగా జాతీ య స్థాయి స్కూల్ గేమ్స్ పతకాలు గెలిచిన పాఠ శాలకు రూ. 25 వేలు ఇస్తారు. అచీవ్మెంట్ సర్వేల కోసం టెస్ట్ మెటీరియల్, ఐటెమ్ బ్యాంక్ ల అభివృ ద్ధికి, శిక్షణ, పరీక్ష నిర్వహణ, డేటా సేకరణ, విశ్లేషణ, నివేదికలు రూపొందించడానికి ఎస్సీఈఆర్టీలలో అసెస్మెంట్ సెల్లు ఏర్పాటు చేస్తారు.. ఈ.. కార్యక్రమాల ప్రగతిని మదింపు చేసేందుకు పలు పనితీరు సూచికలనూ ఏర్పాటు చేశారు. స్మార్ట్ క్లాస్ రూమ్లో భాగంగా ఐసీటీ ల్యాబ్ లు, డిజిటల్ బోర్డులు, వర్చువల్ క్లాస్ రూమ్లు, డీటీహెచ్ ఛానల్ ఏర్పాటుకు సహకారం అందిస్తారు.
12వ తరగతి వరకు కేజీబీవీల అప్గ్రేడ్.
అన్ని కేజీబీవీలను 12వ తరగతికి అప్గ్రేడ్ చేస్తారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కేజీబీవీ విద్యార్థినుల కోసం ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ప్రస్తుతం ఇస్తున్న రూ.25 లక్షల సాయాన్ని 40 లక్షలకు పెంచుతున్నారు. బాలికల హాస్టళ్లలో ఇన్సినరేటర్, శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేస్తారు. ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించడం కోసం 'రాణి లక్ష్మీబాయి ఆత్మ రక్షా శిక్షణ' పేరిట శిక్షణ ఇస్తారు. దీనికోసం రూ. 5 వేల చొప్పున కేటాయిస్తారు.
అమలు ఇలా..
▪️ప్రీ ప్రైమరీలో అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ కోసం మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు. ఈసీసీఈ టీచర్లకు ఇన్ సర్వీస్ శిక్షణ ఇస్తారు.
▪️ప్రభుత్వ పాఠశాలల ప్రీ ప్రైమరీ విభాగాలకు టీచింగ్ లెర్నింగ్ మెటీరి యల్, స్వదేశీ బొమ్మలను అందిస్తారు.
▪️మాన్యువల్ కోసం టీచర్కు రూ.150 చొప్పున ఇస్తారు.
▪️ఆటల కోసం ఒక్కో చిన్నారికి సంవత్స రానికి రూ.500. టీచింగ్ లెర్నింగ్ మెటీరి యల్ కోసం రూ.500 వరకు ఇస్తారు.
▪️సీనియర్ సెకండరీ విద్యార్థుల రవాణా సదుపాయానికి ఏడాదికి రూ.6 వేల చొప్పున ఇస్తారు.
▪️16 నుండి 19 సంవత్సరాల లోపు బడి బయట ఉన్న పిల్లలకు ఓపెన్ స్కూల్ విధానం ద్వారా సెకండరీ సీనియర్ సెకండరీ స్థాయిలను పూర్తి చేయడానికి సహకారం అందిస్తారు..
▪️ఎస్సీ, ఎస్టీ, వికలాంగ పిల్లలకు ఒక్కో గ్రేడికి ఒక్కో విద్యార్థికి రూ. 2వేల వరకు ప్రత్యేకంగా అందిస్తారు.
▪️బాలల హక్కులు, భద్రతకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు ఆర్ధిక సహాయం అందిస్తారు
No comments:
Post a Comment