
సచివాలయ పరీక్షలు పూర్తి
వెబ్ సైట్ లో నేటి నుంచి ప్రిలిమినరీకి
30నుంచి తుది కీ విడుదల
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్రవ్యాప్తంగా 4920 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.7,69,034 మంది పరీక్షలు రాశారు పరీక్షల సందర్భంగా 922 మంది కోవిడ్ అనుమానితులను గుర్తించారు. చివరి రోజు కేటగిరి-3 విలేజ్ ఫిషరీస్ ఉద్యోగానికి 16 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 3195 మందికి గాను 2091 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఇద్దరు కోవిడ్ అనుమానితులకు ఐసోలేషన్ గదులు నిర్వహించారు మధ్యాహ్నం కేటగిరి-3 పశు సంవర్ధకశాఖ అసిస్టెంట్ ఉద్యోగాల పరీక్షకు 13 కేంద్రాల్లో 22 14 మందికి గాను 2021 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. గ్రామ, వార్డు సచివాలయా పరీక్షలు-2020కు సంబంధించి పూర్తయిన 14 పరీక్ష ప్రిలిమనరీ కీ ని గ్రామసచివాలయం వెబ్ సైట్ లో శనివారం రాత్రి నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 29వ తేదీ లోగా వెబ్ సైట్లో నమోదు చేసు కోవాలని సూచించారు. అన్ని పరీక్షలకు సంబంధించిన తుది కీ ని ఈ నెల 30 నాటికి విడుదల చేసేలా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.
Click here....
No comments:
Post a Comment