Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

కొత్త వైరస్ విజృంభణా ? - జనవిజ్ఞానవేదిక సూచనలు

కొత్త వైరస్ విజృంభణా ? - జనవిజ్ఞానవేదిక సూచనలు

కొరోనా వైరస్ కొత్త వేరియంట్ వచ్చిందనీ, అది విపరీతంగా ప్రాకుతుందనీ బ్రిటన్ లాంటి కొన్ని ఐరోపా దేశాలు విపరీతంగా భయపడుతూ నూతన ఆంక్షలు విధిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.

   2019 డిసెంబర్ లో బయటపడిన కొరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఆ వైరస్ లో అనేక మార్పులు ఇప్పటికే వచ్చాయి. ఆ మార్పులనే “మ్యూటేషన్స్” అంటాము. ప్రస్తుతం వచ్చిన మ్యూటేషన్ వలన వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటుందని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలలో ప్రచారం జరుగుతుంది. వైరస్ వ్యాప్తి కంటే ఈ ప్రచారం మరీ ఎక్కువగా జరుగుతుంది. దీనివలన సాధారణ జనం మరోసారి తీవ్రంగా భయపడటం మొదలైంది. ఈ భయం ఎక్కడికి దారి తీస్తుంది?

మాస్కుల అమ్మకాలను పెంచుతాయి.

మందుల అమ్మకాన్ని పెంచుతాయి.

కార్పొరేట్ ఆస్పత్రుల ఆదాయాన్ని విపరీతంగా పెంచుతాయి.

అందులో ఎవరికీ అనుమానం లేదు.

కొన్ని నిజాలు చూద్దాం.

   వైరస్ అయినా, బ్యాక్టీరియా అయినా జనంలోకి వచ్చి పడ్డాక మార్పులు (మ్యుటేషన్స్) చెందక తప్పదు. అది జీవలక్షణం. అదే సమయంలో మార్పు చెందిన వైరసులను, బ్యాక్టీరియాలను ఎదుర్కోటానికి మనశరీరంలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ, రోగనిరోధక పదార్థాలూ కూడా తగిన మార్పులు చెంది ఎదుర్కోవటం మొదలు పెడతాయి. ఇవి రెండూ ఎల్లకాలం జరిగేవే. మ్యూటేషన్ వచ్చిన ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది కానీ మరణాలు ఎక్కువగా లేవనే విషయం బయటకు వచ్చింది. యువతలో, పిల్లలలో ఎక్కువగా వస్తుందని సమాచారం. సహజంగానే వీళ్ళలో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. మరణాలు కచ్చితంగా తక్కువగానే ఉంటాయి. అసౌకర్యమూ, ఇబ్బందీ, ఆస్పత్రులలో చేరటమూ ఇలాంటివి ఉండే అవకాశం మాత్రం ఉంది.

   గతంలో కూడా కోవిడ్-19 విషయంలో పాజిటివ్ వచ్చిన వాళ్ళలో నూటికి 35మందికి ఏ లక్షణాలూ లేవు. 45 మందికి కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయి. మరో 15మందికి లక్షణాలు కొద్దిగా పెరిగినా ప్రమాదం జరగలేదు. ఇతర జబ్బులున్నవాళ్ళను ఎక్కువ జాగ్రత్తలు తీసుకొమ్మని చెప్పాము. వాళ్ళు నూటికి 5గురు.  ఈ కొరోనా వేరియంట్ వచ్చిన సందర్భంలో కూడా ఇవే జాగ్రత్తలు తప్పవు. అప్పటికీ, ఇప్పటికీ జాగ్రత్తల విషయంలో మార్పు లేదు. ఒక్క దమ్మిడీ ఖర్చులేకుండా కొరోనా రాకుండా చేసుకోవటం ఎలా? అని మనం గతంలో చెప్తున్నదే.

   ఆరు అడుగుల దూరం పాటించటం,

   ముక్కుకూ, నోటికి అడ్డు కట్టుకోవటం,

   చేతులు సబ్బుతో కడుక్కోవటం. 

   ఇవి తప్ప ఇందులో మారేదేమి ఉండదు.

   బజారులో తిరుగుతున్న జనం గాలిలోకి వైరస్ ని పంపించటం ద్వారా వైరస్, పలుచబడినందున (డైల్యూట్ అయి) రోగ వ్యాప్తికి దారి తీయటం లేదు. ఇమ్యూనిటీ రావటానికి దారి తీస్తుంది. అంటే హెర్డ్ ఇమ్యూనిటీ, సామూహిక రోగనిరోధకశక్తి రావటానికి దారి తీస్తుంది.

  గాలి ద్వారా వైరస్ ప్రాకుతుందని 239 మంది శాస్త్రవేత్తలు జూలై నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఇచ్చిన ఉత్తరం వలన జనం ఎక్కువగా భయపడిన మాట నిజమే కానీ, వాళ్ళు ఆ స్టేట్ మెంటు క్రిందనే యిలా వ్రాసి ఉన్నారు. “గాలి ద్వారా వైరస్ వ్యాప్తిస్తుంది. క్లోజ్డ్ ఏరియాలలో ఎక్కువగా వ్యాప్తిస్తుంద"ని రాశారు. అంటే బ్యాంకులలో, ఆఫీసులలో భయపడి ఇంట్లో తలుపులు, కిటికీలు మూతవేసుకుంటే ఇంట్లో ఎవరికయినా ఒకరికి కొరోనా ఉంటే మిగతా వాళ్ళకి రావటం, ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ బయటకు వెళ్ళిన వారి ద్వారా గాలిలో కలిసిన వైరస్ డైల్యూట్ అవుతుంది. డైల్యూట్ అయిన వైరస్ జబ్బు తీసుకురావటానికి శక్తి చాలదు. దానివలన కొద్దిపాటి ఎక్స్పోజర్ జనానికి వచ్చినందువలన రోగనిరోధకశక్తి పెరగటానికి దారితీస్తుంది. అందుకే (ముంబైలోని స్లమ్) ధారవిలో విపరీతంగా మరణిస్తారనుకున్నాం.. ఇతర స్లమ్స్ లో కూడా విపరీతంగా మరణిస్తారనుకున్నాము. అలాంటి చోట్లలో కూడా ఇతర చోట్లలాగానే మరణాలు జరిగాయి. అంటే దీని అర్థం ఏమిటంటే, గాలిలో కలిసిన వైరస్ తో రెసిస్టెన్స్ వచ్చింది.

  అంతే మరొక విషయం కూడా ప్రూవ్ అయింది. ఇతర రోగ క్రిములకు వచ్చిన ఇమ్యూనిటీ కొరోనాకు కూడా పనిచేసి ఉండవచ్చు. అందుకే పాజిటివ్ వచ్చిన వారిలో నూటికి 80మందికి పెద్దగా లక్షణాలు లేవు.

   కొరోనా జబ్బు విషయంలో కూడా జనం యొక్క భయాన్ని పోగొట్టటానికి బదులు కొన్ని వైద్యసంస్థలూ, ప్రభుత్వాలూ ఆ భయాన్ని పెంచి కొరోనా వ్యాపారం చేసుకోటానికి తోడ్పడ్డారు.

 “చీరకొంగు గానీ, టవల్ గానీ, కర్చీఫ్ గానీ. నాప్ కిస్ గానీ, ఆఖరికి చేయి అడ్డం పెట్టుకున్నా మన ముక్కు నుంచి, నోటి నుంచి వైరస్ బయటకి పోదు” అనే సమాచారం మన ఎదురుగ్గా ఉంటే మాస్కుల మీద ప్రచారం ఎక్కువగా జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది.

  గాలిద్వారా వైరస్ వ్యాపిస్తుందనే వార్త బయటకి వచ్చిన తర్వాత “తమ మాస్కులకు ఫిల్టర్లు ఉన్నాయ”నే పేరుతో ఫిల్టర్ మాస్కుల అమ్మకం పెరిగింది. 5-10 రూపాయలు ఉండే మాస్కులు వందల రూపాయలకు వెళ్ళిపోయింది. మాస్కుల వ్యాపారం దాదాపు 10-20 రెట్లు పెరిగింది. ఇప్పుడు వైరస్ రెండో వేవ్ తో కొత్త వైరస్ వేరియంట్ వచ్చిందన్న తర్వాత ఈ వ్యాపారం విపరీతంగా పెరుగుతుంది.

  ఇక రెండవది మందులు. ఇప్పటికి ఒక్క మందు కూడా స్పష్టంగా కొరోనా వైరసను చంపుతుందని బయటపడిన సందర్భం లేదు. పనిచేస్తుందని చిన్న చిన్న స్టడీలో బయటపడటమే. దానిని ఆధారం చేసుకొని మందులు వాడేస్తున్నారు. అజిత్రోమైసిన్, ఆమాక్సీ క్లావులినిక్ యాసిడ్, డాక్సీ సైక్లిన్, ఐవర్‌మెన్టల్ అనే మందులు వాడుతూ ఉన్నారు. ఇక ముందు ఇలాంటివి మరికొన్ని మందులు వస్తాయి. ఖరీదైన మందులు వస్తాయి. “మామందు పనిచేస్తుంది. మా మందు పనిచేస్తుంద"ని పోటాపోటీ ప్రచారాలు వస్తాయి. ఆ విధంగా మందుల వ్యాపారం పెరగటానికి దారితీస్తుంది.

  అన్నింటికంటే ముఖ్యమైనది భయం. భయం చాలా చెడ్డది. ఈ భయంతో జనం కార్పొరేట్ల ఆస్పత్రులలో విపరీతంగా చేరి రోజుకు 10వేల నుంచి 40-50వేల రూపాయలు కూడా రూము రెంట్లు చెల్లించి, జనం మరింత పేదోళ్ళు అవుతారు. అసలే డబ్బులు చేతుల్లో లేవు. కొనుగోలు శక్తి పడిపోయింది. దీనికి తోడు ఇక కార్పొరేట్ల కొరోనా అడ్మిషన్స్ వలన మొత్తం దివాళా తీస్తారు. ఈ కొత్త వైరస్ వ్యాప్తి అనేది దీనికయితే దారితీస్తుంది.

  అందువలన మేము ఇచ్చే సూచన ఏమిటంటే ఎన్ని వేరియంట్లు వచ్చినా జాగ్రత్తల్లో మార్పు లేదు.

  పైగా ఇప్పుడు వ్యాక్సీనేషన్ వ్యాపారం ఊపందుకుంది. వ్యాక్సీనేషన్ లో థర్ట్ లెవల్ ట్రయల్స్ సంపూర్ణంగా జరగకుండా జనం మీదకు వదిలేస్తున్నారు. ఏ వ్యాక్సిన్ ఎంతకాలం పనిచేస్తుంది? ఎంత సేఫ్టీ? అనేది పూర్తిగా తేలకుండానే సిఫారసు చేస్తున్నారు. అంటే తాజాగా కొరోనా వ్యాపారం మొత్తంలో వ్యాక్సీన్ వ్యాపారం అన్నింటికంటే టాప్ లోకి వెళ్ళిపోయింది. లక్షల కోట్ల వ్యాపారం క్రింద మారింది. 

  ఒకసారి కొరోనా జబ్బు వచ్చి బాగయినవాళ్ళకి ఎంతో కొంత రెసిస్టెన్సు ఉంటుంది. వాళ్ళు వ్యాక్సీనేషన్ వేసుకోకపోయినా ఇబ్బంది లేదు. రిస్కు గ్రూపుల వాళ్ళు వేసుకోవాలి. వైద్య సహాయం, పారిశుధ్య సహాయం అందించే వాళ్ళు వ్యాక్సీన్ ముందుగా వేసుకోవాలి. ఇది వరకే పాజిటివ్ వచ్చి జబ్బు ఏదోవిధంగా ఎదుర్కొన్న వాళ్ళకు దాదాపుగా వ్యాక్సీన్ అవసరం ఉండదు. కానీ వ్యాక్సీన్ వ్యాపారస్థులు ఊరుకోరు. అందరినీ వ్యాక్సీన్ వేసుకొమ్మని చెప్తారు. వాస్తవంగా అందరూ వేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి మనం ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం ఖర్చు పెట్టినా అది ప్రజల డబ్బే కదా!

   మరీ ఘోరమైన విషయం ఏమిటంటే వ్యాక్సిన్ వలన దుష్పలితాలు వస్తే మాకు సంబంధం లేదు అంటున్నారు వ్యాక్సిన్ తయారీదార్లు. దుష్ఫలితాల అన్నింటికీ వాళ్ళనే చెల్లించమని అంటే ఆ కంపెనీలు దివాళా ఎత్తుతాయి కదా! అని వాళ్ళ తరుపున ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. వాళ్ళు దివాళా ఎత్తకూడదంటే ప్రభుత్వాలు ఆ నష్టపరిహారం కట్టాలి. ఎవరో ఒకరు కట్టినా అది జనం డబ్బే కదా! దుష్ఫలితాలు లేకుండా దాన్ని తయారు చేయటానికి మరికొంత సమయం తీసుకొనమని వ్యాక్సీన్ ను ఎందుకు ప్రోత్సహించరు? ఆ పని చేయకుండా జనం నెత్తిన వేసి, జనమే ప్రయోగశాల క్రింద భావించి, దుష్ఫలితాలు వస్తే మాకు సంబంధం లేదంటే, మరి ఎవరికి సంబంధం? చాలా బాధ్యతరాహితమైన స్టేట్ మెంటు అది.

  అందువలన జనానికి జనవిజ్ఞానవేదిక ఇచ్చే సూచన ఏమిటంటే సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని చెప్పి మీరు భయపడవద్దు. ఇది వరకు తీసుకున్న జాగ్రత్తలు.

ఆరు అడుగుల దూరం పాటించటం, 

ముక్కుకూ, నోటికీ ఏదైనా గుడ్డ అడ్డుకట్టుకోవటం,

చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవటం.

  ఈ మూడు జాగ్రత్తలు మారేదేమీ లేదు. ప్రపంచంలో కొరోనా పోయేదాకా ఈ మూడు జాగ్రత్తలు తప్పదు. ఈ మూడు జాగ్రత్తలు కచ్చితంగా పనిచేస్తాయి.

  కొత్తవాళ్ళు ఎవరన్నా కలిసినా, కొత్త వాళ్ళతో మాట్లాడినా ఆరు అడుగుల దూరం తప్పనిసరిగా పాటించండి. బయటతిరిగే జనంతో కొరోనా జబ్బు రావటం లేదు. రెసిస్టెన్స్ వస్తుంది. అయినా బయటతిరిగేటప్పుడు ఆరు అడుగుల దూరం ముఖ్యం..

  ఢిల్లీలో రైతులు గుంపులు గుంపులుగా ఢిల్లీ ముట్టడిలో ఉన్నారు. వాళ్ళు ఎవరూ మాస్కులు కూడా కట్టుకోలేదు. అక్కడ విపరీతంగా జబ్బు వచ్చి గుట్టలు గుట్టలుగా జనం చనిపోవాలిగా? ఎందుకు చనిపోవటం లేదు. అంటే గాలిలో కలిసిన వైరస్ ప్రమాదం కల్గించటం లేదు అనే కదా!

  పాజిటివ్ వచ్చినా, కొత్త వేరియంట్ తో పాజిటివ్ వచ్చినా నూటికి 80మందికి ఏమీ ప్రమాదం ఉండదు. కొత్త వేరియంట్ వేగంగా ఎక్కువమందికి పాజిటివ్ తెస్తుంది అంతే.

  గతంలో కూడా వందమందికి ఒక మరణం జరిగిందన్నారు. అది కరెక్ట్ కాదు. పాజిటిళ్లు ఎంతమంది ఉంటే అంతకు 60రెట్లమంది పాజిటివ్ లు బయట తిరుగుతున్నారు. అంటే 6000మందికి ఒక మరణం అని అర్ధం. 0.016 మరణాల రేటు. కొత్త వేరియంట్ గతం కంటే మరణాలు తక్కువ అన్నారు కాబట్టి ఈ మరణాలు రేటు ఇంకా తగ్గుతుంది కాని పెరగదు. భయపడాల్సిన అవసరం లేదు.

తీవ్రమైన జ్వరం, 

తీవ్రంగా దగ్గు, 

ఊరికే కూర్చున్నా ఆయాసం,

పల్స్ ఆక్సీ 90 కంటే తగ్గిన 

   ఈ నాలుగు లక్షణాలలో ఏ రెండు ఉన్నా అప్పుడు తప్పనిసరిగా 24 గంటల్లోపల ఆస్పత్రికి వెళ్ళాలి. ప్రైవేటు ఆస్పత్రి కంటే ప్రభుత్వాసుపత్రికి పోవటం ఉత్తమం అంటున్నాం. అక్కడ అన్ని వసతులూ ఉన్నాయి. డాక్టర్లు ఉన్నారు. మందులు ఉన్నాయి. ఈ నాలుగు లక్షణాలు గుర్తు పెట్టుకుంటే చాలు. మిగతా జాగ్రత్తలు మామూలే. ఎన్ని వేరియంట్లు వచ్చినా భయపడాల్సిన అవసరంలేదనే ప్రజలకు మేము పదే పదే విన్నవిస్తున్నాం.

జనవిజ్ఞానవేదిక

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND