అమ్మ ఒడి కి సంబంధించిన ముఖ్య సూచనలు:
(As On 25-12-2020 11.00AM)
ప్రతి పాఠశాల స్కూల్ లాగిన్ నందు రెండు రకాల ఆప్షన్లు ఇచ్చి ఉన్నారు.
1. బ్యాంకు ఎకౌంటు/ఐ ఎఫ్ ఎస్ సి కోడ్ తప్పులు ఉన్నట్లయితే ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల లాగిన్ నందు తప్పులను సరిదిద్దుకోవాలి.
2. అనర్హులు ఎవరైనా అర్హుల జాబితాలో కి వచ్చి ఉన్నట్లయితే (ఉదాహరణకు మన పాఠశాలలో చదవని విద్యార్థి కూడా ఎలిజిబుల్ లిస్టులో ఉన్నట్లయితే లేదా ప్రభుత్వ ఉద్యోగి పిల్లలు ఎవరైనా నా ఎలిజిబుల్ లిస్టులో ఉన్నట్లయితే) అటువంటివారిని ఇన్ ఎలిజిబుల్ చేయడానికి పాఠశాల లాగిన్ నందు ఆప్షన్ ఇచ్చి ఉన్నారు. అటువంటి వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కచ్చితంగా ఇన్ ఎలిజిబుల్ తమ స్థాయిలో చేసుకోవాలి .
పై రెండు ఆప్షన్లు పాఠశాల లాగిన్ లో ఉన్నది కావున తప్పనిసరిగా ప్రధానోపాధ్యాయులు పూర్తి బాధ్యత వహించి ఆయా సమస్యలను పరిష్కరించుకోవ లెను.
అదేవిధంగా 7స్టెప్ వాలిడేషన్ తో అనర్హత జాబితాలోకి వచ్చిన విద్యార్థులను ఈ క్రింది తెలుపబడిన లింక్ నందు ఆ విద్యార్థి యొక్క ఆధార్ నెంబరు లేదా వారి యొక్క తల్లి లేదా గార్డియన్ ఆధార్ నెంబర్ తో చెక్ చేస్తే అటువంటి విద్యార్థులను ఏ కారణంతో (ల్యాండ్, ఫోర్ వీలర్, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎక్కువ కరెంటువాడకము, లాంటివి) అనర్హత వచ్చి ఉన్నదో కారణాలను సరిచూసుకొని,ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయవలెను. దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయులు మరియు సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లు కూడా బాధ్యత వహించి ఆయా కారణాలను లబ్ధిదారులకు తెలియజేయ వలెను. ఒకవేళ వాళ్లు అర్హులు అని భావిస్తే సంబంధిత డాక్యుమెంట్లతో సచివాలయానికి వచ్చి గ్రీవెన్స్ రూపంలో అందించే టట్లు చూడవలెను.
-----------------------------------
https://ammavodihm2.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm
పై లింక్ ద్వారా అమ్మ ఒడి రీజన్స్ తెలుసుకోండి
--------------------------------------
ఇక రేషన్ కార్డు/ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ కారణాలకు ఇంకా పై అధికారుల నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకూ ఆగవలసి ఉన్నది. ఇలాంటి కారణాలు ముఖ్యంగా గత సంవత్సరం ఒక లబ్ధిదారుని వివరాలు, ఈ సంవత్సరం మరొక లబ్ధిదారుని వివరాలు ఇవ్వడం వలన, అలాగే విద్యార్థి రేషన్ కార్డు నందు నమోదు కాకపోవడం వలన ఇలాంటి సమస్యలు వచ్చినట్లు గుర్తించడం జరిగింది. దీనికి పరిష్కారము పై అధికారుల నుండి తగు ఆదేశాలు వచ్చేంత వరకూ ఆగవలసి ఉన్నది.
పై విషయాలన్నీ ప్రధానోపాధ్యాయులు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లు, సి ఆర్ పి లు అవగాహన పొంది ,తమ వద్దకు వచ్చే తల్లిదండ్రులకు తెలియజేయాలని ఇందుమూలంగా సూచించడమైనది.
No comments:
Post a Comment