నేటి నుంచి టెన్త్ విద్యార్థులకు రెండు పూటలా తరగతులు
పదవ తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి రెండు పూటలా తరగతులు నిర్వహించనున్నారు
టెన్త్ విద్యార్థులకు 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
రోజూ ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20 వరకు తరగతులు నిర్వహిస్తారు
జాతీయ, ఇతర పర్వదినాలు మినహా, అన్ని రోజులూ తరగతులు జరుగుతాయి.
ఆదివారాల్లో ఒక పూట జరుగుతాయి
కాగా ఆరవ తరగతి విద్యార్థులకు కూడా సోమవారం నుంచి కొవిడ్ నిబంధనల ప్రకారం తరగతులు నిర్వహిస్తారు
ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు నిర్వహించాలని ఇంటర్ బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు
106 పనిదినాలతో మే 31 వరకు తరగతులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
రెండో శనివారం కూడా తరగతులు నిర్వహించాలని సూచించారు.
ఈ నేపథ్యంలో వేసవి సెలవులు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
10 th Class 103 Days Action Plan .. Prakasam District
No comments:
Post a Comment