కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్లు సమర్పించాలి.. పూర్తి వివరాలివే..
దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.. కరోనాపై పోరాటానికి ఒక సంజీవిని లాంటింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా అనుమతించబడిందిసిరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు ఈ వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్నాయి
వ్యాక్సిన్ పొందాలంటే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి..?
అప్లికేషన్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.కోవిన్ (CoWin -Covid vaccine Intellignce work) ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఐదు పద్దతులలో ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్ పద్దతి, రిజిస్ట్రేషన్ పద్దతి, వ్యాక్సినేషన్ పద్దతి, బెనిఫిషరీ ఆకానాలెడ్జమెంట్ పద్దతి, రిపోర్టు పద్దతి. ఈ పద్దతుల్లో సులభంగా వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషణన్ చేసుకోవచ్చు. అయితే కోవిన్ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఈ దరఖాస్తు పద్దతి ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉంది. సాధారణ ప్రజలు కోవిన్ ద్వారా రిజిస్టర్ చేసుకోలేరు. ప్రస్తుతానికి అధికారులు మాత్రమే అనుమతి ఉంది. కోవిన్ యాప్ లేదా వెబ్ సైట్ లో మూడు ఆప్షన్స్ ఉన్నాయి. సెల్ఫ్ రిజిస్ర్టేషన్, వ్యక్తిగత రిజిస్ట్రేషన్, ఒకేసారి పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.
కోవిడ్ వ్యాక్సిన్ పొందడానికి కావాల్సిన పత్రాలు..
కోవిడ్ వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఫొటో అప్ లోడ్ చేయాలి. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ కు దరఖాస్తు చేసుకోగానే మెసెజ్ పొందుతారు. కోవిడ్ వ్యాక్సిన్ పొందడానికి దరఖాస్తు చేసుకున్నట్లు మెసేజ్ పొందుతారు. రెండో మెసేజ్ లో తేదీ, సమయం, వ్యాక్సినేషన్ కేంద్రం వివరాలను పొందగలరు. మూడో మెసేజ్ లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ గురించి ఉంటుంది.
No comments:
Post a Comment