Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఏ.పి. స్టేట్ & సబార్డినేట్ సర్వీస్ రూల్సు - 1996

 ఏ.పి. స్టేట్ & సబార్డినేట్ సర్వీస్ రూల్సు - 1996
రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యమునగల గజిటెడ్, నాన్ గజిటెడ్ పోస్టులకు సంబంధించి డిపార్టుమెంట్ల వారీగా వేర్వేరు సర్వీసు నిబంధనలు గలవు. వాటన్నిటికి వర్తించెడి సాధారణ నిబంధనలు, ప్రత్యేక నిబంధనలు, తాత్కాలిక నిబంధనలు స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ - 1996 పేరున జిఓ.ఎంఎస్.నం. 436 4ఏడి తేది. 15. 10. 1996(అధ్యాపక దర్శిని-15) ద్వారా ఇవ్వబడినవి.
            ఉద్యోగుల సర్వీసుకు సంబంధించి సాధారణంగా వాడబడెడి - క్యాడర్, డ్యూటీ, రెగ్యులర్ అపాయింట్ మెంట్,
ప్యానల్, ప్రొబేషన్, అప్రూఫ్ట్ క్యాండిండేట్, సర్వీస్ మున్నగు పదముల నిర్వచనములు రూలు-2 నందు ఇవ్వబడినవి.
నియామకము : ఆయా ప్రభుత్వ సర్వీసు లందు నియామకము 4 విధములుగా జరుగును. అవి 1) క్రొత్తవారిని
ఎంపికచేసి, నియమించు "డైరెక్ట్ రిక్రూట్ మెంట్” 2) ఇతర సర్వీసు లేక అదే సర్వీసుకు చెందిన మరొక సమాన స్థాయి
పోస్టు నుండి నియమించు రిక్రూట్‌మెంట్ బై ట్రాన్స్ ఫర్ 3) ప్రమోషన్ 4) కాంట్రాక్టు అగ్రిమెంటు పద్ధతిపై నియామకము.
         నియమ నిబంధనలన్నిటిని పాటించి నియమించుట ఆలస్యమునకు కారణమగు సందర్భములో ప్రజా ప్రయోజనాల రీత్యా నియామకాధికారి ఒక వ్యక్తిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించవచ్చును. (రూలు 10),
          ఒకే సర్వీసుకు చెందిన ఒక క్యాటగిరి నుండి వేరొక క్యాటగిరికి ప్రమోషన్ పొందవలెనన్నను, ఒక సర్వీసు నుండి
మరియొక సర్వీసునకు బదిలీపై నియామకము పొందవలెనన్నను ఉద్యోగి తాను ప్రస్తుతము పని చేయుచున్న క్యాడరునందు ప్రొబేషనను పూర్తిచేసియుండాలి. (రూలు 8)
 డైరెక్టు రిక్రూట్మెంట్ అర్హతలు : ఎ) మంచి ఆరోగ్యము, అలవాట్లు గలిగి, సంబంధిత పోస్టులో పని చేయుటకు తగిన
శారీరక దారుఢ్యము కలిగి వుండాలి. బి) మంచి నడవడి, ప్రవర్తన కలిగియున్నట్లు నివేదిక వుండాలి.సి) పోస్టుకు
అవసరమైన విద్య, ఇతర అర్హతలు కలిగి వుండాలి. డి) నిర్ణీత వయోపరిమితి కలిగి వుండాలి. (రూలు 12)
ప్యానల్ లిస్టు తయారు : ఆం.ప్ర. పబ్లిక్ సర్వీసు కమీషన్ పరిధిలోని పోస్టుల విషయములో స్క్రీనింగ్ కమిటీతోను, పబ్లిక్
సర్వీసు కమీషతో సంబంధంలేని పోస్టుల విషయంలో డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ (డిపిసి)తోను సంప్రదించిన
మీదట నియామక అధికారి అప్రూఫ్ట్ క్యాండిడేట్స్ ప్యానల్ ను తయారు చేయును. రానున్న సంవత్సరం ఆగస్టు 31 వరకు ఏర్పడు ఖాళీలకై 1:3 నిష్పత్తిలో అర్హులైన వారి ప్యానల్ తయారు చేయబడును. (రూలు 6)
విధులలో చేరుటకు గడువు : డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్రింద నియమించబడినవారు నియామక ఉత్తర్వులు రిజిష్టరు పోస్టు
ద్వారా పంపబడిన తేదీ నుండి 30 రోజులలోగా విధులలో చేరాలి. ప్రమోషన్ పై నియమించబడిన వారు ఉత్తర్వులు
అందిన 15 రోజులలోగా విధులలో చేరాలి. అట్లు 15 రోజులలో విధులలో చేరని వారు మరుసటి సంవత్సరం ప్రమోషన్
ప్యానల్ లో చేర్చబడతారు. (జిఓ 145 జిఏడి, తేది. 15.06.2004)
సెలక్షన్ లిస్టు : నియామకముపై రూలు-22లో ఇవ్వబడిన రోస్టర్ పాయింట్ల ప్రకారము సెలక్షన్ లిస్ట్ (మెరిట్- కం-
కమ్యునల్ రోస్టర్) తయారు చేయబడును. పూర్తి వివరములు ప్రక్క పేజీలో ఇవ్వబడినవి.
టెస్టులు: ఎ) ప్రొబేషన్ పీరియడు పూర్తగులోగా తెలుగుభాషా పరీక్ష పాస్ కావాలి. అయితే ఎస్ఎస్ సి లేక తత్సమాన
పరీక్షను తెలుగు మాధ్యమంగా పాసయిన వారికి మరియు 45 సంవత్సరముల వయస్సు నిండినవారికి మినహాయింపు వున్నది. (రూలు 13 & 14)
బి) క్రొత్తగా నిర్దేశించిన డిపార్ట్ మెంటల్ పరీక్షలను ప్రొబేషన్ ను పీరియడులోగా లేక ప్రమోషను పొందిన తదుపరి
నిర్వహించబడిన రెండు పరీక్షల కాలములోగా, ఏది తర్వాత అయితే దానిలోగా పాస్ కావాలి. (రూలు 15)
సీనియార్టీ : ఒక ఉద్యోగి సీనియార్టీ అతడు ఉద్యోగములో చేరిన తేదీ నుండి లెక్కించబడుతుంది. (రూలు 33ఎ) అయితే
నియామకముల నిమిత్తము నియామకాధికారి అభ్యర్థుల జాబితా తయారు చేసి వున్నచో సదరు జాబితాలోని క్రమము ప్రాతిపదికగా అతని సీనియార్టీ నిర్ణయించబడుతుంది. (రూలు 33బి)
ప్రొబేషన్ పిరియడ్ : డైరెక్ట్ రిక్రూట్మెంట్ వారి విషయములో నియామకపు తేదీ నుండి మూడు సంవత్సరాల అవిచ్చిన్న
కాలములో 2 సంవత్సరములు, ప్రమోషన్ పై నియామకము పొందిన వారి విషయములో 2 సంవత్సరముల అవిచ్ఛిన్న సమర్థవంతంగా కాలములో 1 సంవత్సరము సర్వీసు ప్రొబేషన్ పిరియడ్ గా పరిగణించబడుతుంది. (రూలు 16) - పనిచేసినట్లు ప్రొబేషన్ డిక్లరేషన్ జరిగితే అట్టి ఉద్యోగి సర్వీసులో స్థిర పరచబడును. (రూలు 21)

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND