రేపు ఇంటర్ పరీక్ష ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన ఇంటర్మీడియట్ ఆఖరి పరీక్షలు బుధవారం జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 24 పరీక్షా కేంద్రాల్లో జరగబోయే ఈ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారులు తెలిపారు. మార్చిలోనే ప్రారంభమైన ఇంటర్ పరీక్షల్లో 23వ తేదీన జరగాల్సిన చివరి పరీక్షలు మోడరన్ లాంగ్వేజ్- 2 తెలుగు- 2, మోడరన్ లాంగ్వేజ్ ఇంగ్లీషు- 2 లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి . అనంతరం ఈ పరీక్షలను జూన్ మూడో తేదీన నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో భౌతిక దూరం, ఇతర రక్షణ చర్యలు చేపడుతూ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షకు హాజరయ్యే వారు ఎవరైనా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నా. శి బ్రా , వెబ్సైట్ నుంచి చేసుకోవచ్చు. మరోవైపు కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వాటన్నింటినీ ఇప్పటికే పూర్తిగా శానిటైజ్ చేశారు.
కొనసాగుతున్న మూల్యాంకనం..
ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది.మే నుంచి ప్రారంభమైన వాల్యుయేషన్ ప్రక్రియ జూన్ ఆరు వరకు కొనసాగనుంది. వాల్యుయేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 46 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధారణగా జిల్లాకు ఒకటి లేదా రెండు మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేసి వాల్యుయేషన్ చేపట్టేవారు. అయితే కరోనా నేపథ్యంలో మూల్యాంకన కేంద్రాల సంఖ్యను పెంచడంతోపాటు నిబంధనలు పాటిస్తూ పేపర్లు దిద్దేలా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగే పరీక్ష తో కలిపి మొత్తం మూల్యాంకనం ఈ నెల ఆరుకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అనంతరం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే లా ఇంటర్మీడియట్ విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది.

Which State??
ReplyDelete