Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Ammavodi::అమ్మఒడి పథకం పైన HMs కు ఒక అవగాహన

అమ్మఒడి కి సంబందించి మనకు 3 జాబితాలు వచ్చినవి అవి సచివాలయములకి పంపటము జరిగినది. వాటి గురించి వివరణ చూడండి.

Jagananna ammavodi

జాబితా-1:(List for eligible) ఇందులో మొదటి విడత అర్హుల పిల్లల అందరి వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. అందుకు అవసరమైన document xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన Grievance format లో submit చేయాలి.

జాబితా-2: (List for ineligible/List of Candidates who require further verification on given remarks) ఇందులో రకరకాల కారణాలతో తాత్కాలిక అనర్హుల పిల్లల వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏ కారణముతో వారు అనర్హులయ్యారో వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. వారి వాదనకు తగిన document proof xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన  Grievance format  లో submit చేయాలి.

జాబితా-3:(Re confirmation/re verification required)  ఇందులో వచ్చిన వివరములు మరొకసారి verify చేయాలి. కావున మీరు పిల్లల ఆధారు, తల్లి ఆధారు, బ్యాంకు పాసుబుక్, రేషన్ కార్డు xeroxలు మరియు ఫోన్ నెం. అన్నీ రెండు కాపీలు తీసుకోవాలి. అలాగే మీకు ఇవ్వబడిన *Grievance format* లో submit చేయాలి

మీకు 3 రకాల ఫార్మ్స్ పంపడం జరిగింది.

ఇందులో ... 

1. అమ్మ వొడి అర్హుల వివరముల సవరణ దరకాస్తు (Amma Vodi Correction Form) లో List-I లో ఉన్న విద్యార్ధుల వివరములు ఏవైనా తప్పు ఉన్న యెడల, అందులో ఫిల్ చేయవలెను.

2. అమ్మ వొడి అభ్యంతరముల దరకాస్తు (Amma Vodi Objections Form) లో  List-II &  List-III ఉండి అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.

3. అమ్మ వొడి పధకము వర్తింపు కొరకు దరకాస్తు (Amma Vodi Grievance Form) నందు అర్హులు అయ్యి ఉండి, List-I, List-II &  List-III  లో లేని విద్యార్ధులు అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.


పైన ఇవ్వబడిన అన్ని ఫార్మ్స్ కూడా సంబంధించినవారు పూర్తిచేసి గ్రామసచివాలయంలోని వాలంటీర్ కు లేదా వెల్ఫేర్ &  ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు అందజేయాలి. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఈ ఫార్మ్ లను వాలంటీర్ లతో   వెరిఫికేషన్ చేయించి కౌంటర్ సిగ్నేచర్ తో మరియు రిమార్క్స్ తో  మండల విద్యా శాఖాధికారి కార్యాలయంలో  అందజేయాలి.

============ 

𝐀𝐌𝐌𝐀 𝐕𝐎𝐃𝐈 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: 2022-23 విద్యా సంవత్సరంలో అమ్మ ఒడి నగదు నుంచి 2 వేలు మినహాయింపు.

➪ టాయిలెట్స్ నిర్వహణ, పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు ఈ నగదు  మినహాయించి 13 వేలు జమ చేయనున్న ప్రభుత్వం.

➪ప్రాథమికంగా అర్హత సాధించిన వారి అర్హుల జాబితా,విద్యార్థులు నివసిస్తున్న గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ వారికి యాప్ ద్వారా ఇవ్వటం జరిగినది,

➪ఆ యాప్ లో విద్యార్థి యొక్క తల్లి బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది

➢విద్యార్థి యొక్క తల్లిగారి బ్యాంకు ఎకౌంటు ఆధార్ కార్డు తో NPCI లింక్ చేసి ఉండవలెను

➣అమ్మ ఒడి కి సంబంధించి అర్హత ఉన్నా కూడా  పేరు రానియెడల సెర్చ్ ఆప్షన్ ద్వారా చూసి బయోమెట్రిక్ వేయవలెను

➢ఎవరైనా విద్యార్థి యొక్క తల్లి మరణించిన యెడల వారి పేరు ఇప్పుడు బయోమెట్రిక్ వచ్చి ఉంటే అది తండ్రి పేరు మార్చుటకు త్వరలో సచివాలయం నందు ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది

➣విద్యార్థి యొక్క తల్లి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే గ్రామ సచివాలయం నందు బయోమెట్రిక్ వేయవచ్చును.

:::::::::::::::::::::::::::::

అమ్మ ఒడి సమాచారం 

1. 75 శాతం హాజరు ఉండాలి.

2. బియ్యం కార్డు కొత్తది ఉండాలి.

3. కరెంట్ బిల్లు 300 యూనిట్లు కన్నా తక్కువ ఉండాలి.

4. household మ్యాపింగ్ పిల్లవాడు,తల్లి ఒకే మ్యాపింగ్ లో ఉండాలి.

5. అప్డేట్ ఈ కేవైసీ పిల్లవాడికి చేయించుకోవాలి.

6. వార్డ్ Volunteers దగ్గరికి వెళ్లి విద్యార్థి యొక్క పేరు ,వయసు  సరిచూసుకోవాలి.

7. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి.

8. మీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ తో లింక్ చేయించుకోవాలి.

9. మీ బ్యాంకులో అమౌంట్ గాని లేకపోతే కొంత అమౌంట్ వేసి ఉండాలి.

10. బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో ఉండాలి.

11. ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లయితే NPCI  చేయించుకోవాలి.

12. గవర్నమెంట్ ఉద్యోగి, ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి జగనన్న అమ్మ ఒడి వర్తించదు.

-------------------------

Click here.....

Ammavodi Dashboard

--------------------------

Click here...

Ammavodi e-kyc

----------------------------

Click here...

Ammavodi grievance

-----------------------------

Click here... 

Ammavodi Beneficiary outreach app 4.7

------------------------------

Click here....

Ammavodi Beneficiary outreach app ఉపయోగించే విధానం

--------------------------------

Click here....

Ammavodi BOR Application లో చేయవలసినవి.

------------------------------

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND